Maruti Suzuki: మారుతి ఆల్-టైమ్ నం.1 కార్‌పై రూ.62,500 భారీ డిస్కౌంట్.. సెప్టెంబర్ 30 వరకే ఛాన్స్
Maruti Suzuki: సొంత కారు కోరికను నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులకు మారుతి సుజుకి అదిరిపోయే పండగ ఆఫర్ ప్రకటించింది.
Alto K10
Maruti Suzuki: సొంత కారు కోరికను నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులకు మారుతి సుజుకి అదిరిపోయే పండగ ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆల్టో K10 మోడల్‌పై సెప్టెంబర్ నెల ముగిసేలోపు రూ.62,500 వరకు బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. అద్భుతమైన మైలేజ్, అందుబాటులో ఉండే ధరతో ఉన్న ఈ ఆఫర్ ఇప్పుడు కార్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మధ్యతరగతి కుటుంబాల తొలి ప్రాధాన్యతగా నిలిచే మారుతి సుజుకి సంస్థ సెప్టెంబర్ మాసానికి సంబంధించి విభిన్న కార్ల మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీకి చెందిన ఆల్-టైమ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఆల్టో K10 కొనుగోలుపై గరిష్టంగా రూ.62,500 వరకు పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి ఈ విధమైన భారీ తగ్గింపును అందిస్తున్నారు. సెప్టెంబర్ 30 తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక ఆఫర్ కొత్త కార్ కొనాలనుకునే వారికి సువర్ణావకాశంగా మారింది.
ఆల్టో K10 శ్రేణిలో P MT LXI వేరియంట్‌పై అత్యధికంగా రూ.62,500 వరకు ప్రయోజనం చేకూరుతోంది. ఇందులో రూ.35,000 కన్స్యూమర్ ఆఫర్, రూ.10,000 పీసీఎమ్ బోనస్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ (లేదా రూ.10,000 స్క్రాపేజ్ బోనస్) తో పాటు ఇన్సిస్టిట్యూషనల్, రూరల్ డిస్కౌంట్లు చేరి ఉన్నాయి. ఇక బేసిక్ 'Std' వేరియంట్ సహా సీఎన్జీ మోడళ్లపై రూ.37,500 వరకు, మిగిలిన పెట్రోల్ మోడళ్ల కొనుగోలుపై మొత్తం రూ.42,500 దాకా ఆదా చేసుకోవచ్చు. వినియోగదారులు ఎంచుకునే మోడల్, ప్రాంతాన్ని బట్టి ఈ ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశముంది.
దేశీయంగా ఏకంగా 50 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన ఏకైక మోడల్‌గా ఆల్టో K10 చరిత్రకెక్కింది. సరికొత్త డిజైన్‌తో రూపొందిన ఈ కారులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పవర్ విండోస్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉండే కే-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్ అటు మాన్యువల్, ఇటు ఆటోమేటిక్ (AGS) గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 24.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, సీఎన్జీ వేరియంట్ కేజీకి ఏకంగా 33.85 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ ప్రయాణ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది.
చిన్న కారే అయినా సేఫ్టీ ప్రమాణాల విషయంలో మారుతి సుజుకి రాజీ పడలేదు. ఆల్టో K10 లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ టెక్నాలజీతో కూడిన ఈబీడీ ఏబీఎస్ సిస్టమ్, వెనుక భాగంలో పార్కింగ్ సెన్సార్లు, పిల్లల సురక్షిత ప్రయాణానికి చైల్డ్ లాక్ సదుపాయాన్ని ప్రామాణికంగా అందించారు. రూ.3.70 లక్షల బేసిక్ ఎక్స్-షోరూమ్ ధర నుంచి ప్రారంభమయ్యే ఈ కారు టాప్ ఎండ్ మోడల్ రూ.5.45 లక్షల వరకు అందుబాటులో ఉంది.




