Upcoming SUVs: కార్ లవర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రాబోతున్న 7 కొత్త ఎస్‌యూవీల ప్రత్యేకతలు ఇవే

Upcoming SUVs: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

CR Reddy
Published on: 27 Sept 2026 11:23 AM IST
Maruti Grand Vitara Facelift
X

Maruti Grand Vitara Facelift

Upcoming SUVs: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి, టయోటా కంపెనీలు త్వరలోనే మార్కెట్‌ను షాక్ ఇచ్చేలా ఏకంగా 7 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో పాపులర్ కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో పాటు సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. మీరు కనుక కొత్త కారు కొనే ఆలోచనలో ఉంటే, ఈ అప్‌కమింగ్ మోడల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1. మారుతి గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్

మారుతి అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీ అయిన గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం వాహనదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కంపెనీ దీనిని 2026 పండుగ సీజన్ లేదా 2027 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో సరికొత్త 10.1-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇంజిన్ పరంగా ప్రస్తుతమున్న 1.5-లీటర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, సీఎన్‌జీ ఆప్షన్లే కొనసాగే ఛాన్స్ ఉంది.

2. 7-సీటర్ మారుతి గ్రాండ్ విటారా

పెద్ద కుటుంబాల కోసం మారుతి సుజుకి‎ ప్రత్యేకంగా ఒక కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని తీసుకువస్తోంది. Y17 కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ కారు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. ఇందులో దాదాపు 2740 మిమీ పొడవైన వీల్‌బేస్ ఉండటం వల్ల క్యాబిన్ లోపల విశాలమైన స్థలం లభిస్తుంది. 1.5-లీటర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌లతో పాటు సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా ఇది లభించే అవకాశం ఉంది.

3. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఫేస్‌లిఫ్ట్

టయోటా బ్రాండ్ నుంచి వస్తున్న పాపులర్ ఎస్‌యూవీ హైరైడర్ కూడా కొత్త హంగులతో మార్కెట్లోకి రానుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అత్యాధునిక కంఫర్ట్ ఫీచర్లు యాడ్ చేయనున్నారు. ప్రస్తుతమున్న 1.5-లీటర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇందులోనూ కొనసాగుతాయి.

4. మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్

యువతను విపరీతంగా ఆకట్టుకున్న మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2026 నవంబర్ నాటికి లాంచ్ కానుంది. దీని డిజైన్‌లో భాగంగా కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, కొత్త ఎల్ఈడీ లైట్లు వస్తాయి. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్-2 ADAS ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (సుమారు 81 bhp పవర్), సీఎన్‌జీ ఆప్షన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్‎ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

5. టయోటా టైజర్ ఫేస్‌లిఫ్ట్

మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా తయారైన టయోటా టైజర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2027లో లాంచ్ కానుంది. ఎక్స్‌టీరియర్‌లో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ లైట్లు, బంపర్ మార్పులు ఉంటాయి. క్యాబిన్‌లో వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, లెవెల్-2 ADAS వంటి అధునాతన భద్రతా ఫీచర్లు జత చేయనున్నారు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్‎, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లు యథావిధిగా కొనసాగుతాయి.

6. 7-సీటర్ టయోటా హైరైడర్

టయోటా సంస్థ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ 7-సీటర్ హైరైడర్‌ను తీసుకువస్తోంది. 2026 పండుగ సీజన్ లేదా 2027 ప్రారంభంలో ఇది లాంచ్ కావచ్చు. 4.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండే ఈ కారులో 6, 7-సీటర్ కాన్ఫిగరేషన్ ఆప్షన్లు లభిస్తాయి. పవర్ఫుల్ 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో ఈ ఎస్‌యూవీ రోడ్డు మీదకు రానుంది.

7. నెక్స్ట్-జెన్ టయోటా ఫార్చ్యూనర్

లగ్జరీ ఎస్‌యూవీ లవర్ల డ్రీమ్ కార్ అయిన టయోటా ఫార్చ్యూనర్ కొత్త తరం మోడల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2026 చివరి నాటికి గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేయనున్న ఈ కొత్త ఫార్చ్యూనర్, 2027 ప్రారంభంలో భారత్‌లో లాంచ్ కానుంది. సరికొత్త ఐఎమ్‌వి ప్లాట్‌ఫారమ్‌పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 2.8-లీటర్ డీజిల్ మైల్డ్ హైబ్రిడ్, 2.7-టీటర్ పెట్రోల్‎ ఇంజిన్‌లతో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.