Brezza 2026 బ్లాస్ట్.. టర్బో పవర్ + 5-స్టార్ సేఫ్టీతో మారుతి మాస్టర్‌స్ట్రోక్.!

భారత కాంపాక్ట్ SUV విభాగంలో సరికొత్త సంచలనానికి మారుతి సుజుకి తెరలేపింది. తన పాపులర్ SUV బ్రెజ్జా 2026 వెర్షన్‌ను రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో..

G Krishna
Published on: 25 July 2026 1:25 PM IST
maruti suzuki brezza 2026
X

maruti suzuki brezza 2026 


భారత కాంపాక్ట్ SUV విభాగంలో సరికొత్త సంచలనానికి మారుతి సుజుకి తెరలేపింది. తన పాపులర్ SUV బ్రెజ్జా 2026 వెర్షన్‌ను రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. మునుపటి మోడళ్లతో పోలిస్తే ఈసారి అత్యంత భారీ మార్పులతో వచ్చిన ఈ కారులో పవర్‌ఫుల్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, మైండ్ బ్లోయింగ్ ఇంటీరియర్ ఫీచర్లు , టాప్-నోచ్ సేఫ్టీ టెక్నాలజీని పరిచయం చేశారు. హుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్షన్, మహీంద్రా XUV 3XO వంటి గట్టి పోటీదారులకు చెక్ పెట్టేలా ఈ లేటెస్ట్ బ్రెజ్జా రూపుదిద్దుకుంది.

ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్ లుక్

కొత్త బ్రెజ్జా ఓవర్‌ఆల్ బాడీ షేప్ లో పాత రూపురేఖలనే కొద్దిగా కాపాడుకున్నప్పటికీ, డిజైన్ పరంగా చాలా రిఫ్రెషింగ్ మార్పులు కనిపించేలా తీర్చిదిద్దారు. ముందూ వెనుక బంపర్లను రీ-వర్క్ చేయడంతో పాటు డార్క్ క్రోమ్ డీటైలింగ్ , కొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను చేర్చారు. ఐకానిక్ L-షేప్ DRLs తో కూడిన LED ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్ అలాగే ఉన్నప్పటికీ, ఫాగ్ లాంప్స్‌ను సరికొత్త ట్రయాంగులర్ హౌసింగ్‌లోకి మార్చారు.

సైడ్ ప్రొఫైల్ వైపు వస్తే డ్యూయల్-టోన్ బాడీ క్లాడింగ్ , కొత్తగా డిజైన్ చేసిన 16-ఇంచ్ అలాయ్ వీల్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. వీటితో పాటు వివేషియస్ ఆరెంజ్, లస్ట్రస్ బైజ్ అనే రెండు కొత్త డ్యూయల్-టోన్ రంగులను పరిచయం చేశారు. ప్రత్యేకంగా టర్బో-పెట్రోల్ వేరియంట్ల కోసం వెనుక వైపు 'Turbo' బ్యాడ్జింగ్, గ్రిల్ , వీల్ ఆర్చ్‌లపై రెడ్ యాక్సెంట్లు ఇచ్చి కాస్త స్పోర్టీ టచ్ ఇచ్చారు. కారు పొడవు 3,995 mm, వెడల్పు 1,790 mm, ఎత్తు 1,685 mm గానూ, వీల్‌బేస్ 2,500 mm గానూ కొనసాగుతున్నాయి.

హైటెక్ హంగులు, తిరుగులేని క్యాబిన్ సౌకర్యాలు

క్యాబిన్ విషయానికి వస్తే డ్యూయల్-టోన్ బ్లాక్ & బ్రౌన్ లేఅవుట్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మునుపటి సిల్వర్ ఇన్సర్ట్‌ల స్థానంలో గ్లాస్ బ్లాక్ ట్రిమ్‌ను ఉపయోగించడంతో పాటు లెథరెట్ సీట్ల పాటర్న్‌ను మార్చారు. ఈసారి అందించిన ఫీచర్ల అప్‌గ్రేడ్స్ ఈ SUV కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాత 9-ఇంచ్ స్థానంలో ఇప్పుడు పెద్దదైన 10.1-ఇంచ్ SmartPlay Pro X ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇది ఇన్-బిల్ట్ నేవిగేషన్ , అలెక్సా కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

ప్రయాణాన్ని మరింత సుఖమయం చేయడానికి 64-కలర్ అంబియంట్ లైటింగ్, ముందు సీట్లకు వెంటిలేషన్ సౌకర్యం, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ , ఆక్టివ్ కూలింగ్ సపోర్ట్ ఉన్న వైర్‌లెస్ ఛార్జర్‌ను చేర్చారు. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం సరికొత్త HVAC కంట్రోల్స్ ఉపయోగించడం వల్ల క్యాబిన్ మరింత లగ్జరీ లుక్‌ను సంతరించుకుంది.

సరికొత్త పవర్‌ట్రెయిన్, డిక్కీలో ఎక్కువ స్థలం ఇచ్చే సిఎన్జి

ఇంజిన్ అప్‌గ్రేడ్‌ల పరంగా 2026 బ్రెజ్జా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇందులో కొత్తగా మారుతి సుజుకి 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేశారు. ఇది 110bhp పవర్, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ ప్రియుల కోసం ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందిస్తున్నారు.

మరొక వైపు నమ్మకమైన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 103bhp పవర్, 139Nm టార్క్‌ను అందిస్తూ 6-స్పీడ్ మాన్యువల్ , 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక మైలేజ్ ప్రియుల కోసం ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్జి వేరియంట్‌ను కూడా తీసుకొచ్చారు. ప్రత్యేకించి ఇందులో సిఎన్జి సిలిండర్‌ను కారు కింద భాగంలో అమర్చడం వల్ల లగేజ్ సర్దుకోవడానికి బూట్ స్పేస్ చాలా బాగా కలిసి వస్తుంది.

భద్రతలో టాప్ క్లాస్.. 5-స్టార్ రేటింగ్‌తో భరోసా

భద్రత విషయంలో మారుతి సుజుకి కాంప్రమైజ్ కాకుండా బ్రెజ్జాను మరింత సురక్షితంగా తీర్చిదిద్దింది. ఈ కారు భారత్ NCAP (Bharat NCAP) క్రాష్ టెస్ట్‌లో ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి తన కేటగిరీలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

ప్రామాణిక సేఫ్టీ ప్యాకేజీతో పాటు కొత్తగా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), బ్లైండ్-స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ , ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను జోడించారు. పవర్‌ఫుల్ ఇంజిన్, అదిరిపోయే లుక్స్, ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు , 5-స్టార్ భద్రత కలబోతగా వచ్చిన ఈ 2026 మారుతి బ్రెజ్జా ఇండియన్ మార్కెట్లో మళ్లీ తన జెండా పాతడం ఖాయంగా కనిపిస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story