34 కిమీల మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ.. క్రెటా, బ్రెజ్జాలకు ఫీవర్ పెంచేసిన రూ. 6.26 లక్షల కారు.!
Maruti Suzuki Dzire: ప్రీమియం ఫీచర్లతో వచ్చిన మారుతీ సుజుకీ డిజైర్ అమ్మకాల్లో దూసుకపోతోంది. క్రెటా, బ్రెజ్జాలను మించి ఆదరణ పొందింది. ఏకంగా 5 స్టార్ రేటింగ్ తో ఫుల్ సేఫ్టీని కూడా అందిస్తోంది.
34 కిమీల మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ.. క్రెటా, బ్రెజ్జాలకు ఫీవర్ పెంచేసిన రూ. 6.26 లక్షల కారు.!
Maruti Suzuki Dzire 2026: ప్రస్తుతం ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ఇలాంటి ఎస్ యూవీల రోజుల్లోనూ ఒక సరికొత్త సెడాన్ కారు అమ్మకాలలో సంచలనం సృష్టిస్తూ దిగ్గజ మోడళ్లను సైతం వెనక్కి నెట్టింది. అద్భుతమైన మైలేజ్, తిరుగులేని భద్రత, అధునాతన హంగులతో వచ్చిన ఈ కారు మధ్యతరగతి ప్రజల కలల వాహనంగా మారి, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా సరికొత్త రికార్డులను సృష్టించింది.
అమ్మకాల్లో సరికొత్త రికార్డు..
మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది నమ్మకం, పొదుపు. 2008లో ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రస్తుతం నాలుగవ తరానికి చేరుకుంది. 2026 మార్చి నెలలో ఏకంగా 21,224 యూనిట్ల విక్రయాలతో, గత ఏడాదితో పోలిస్తే 37 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రెటా, బ్రెజ్జా, నెక్సాన్ వంటి ప్రజాదరణ పొందిన వాహనాలను అధిగమించి, అమ్మకాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
అందుబాటులో ధర.. అందరికీ ఇష్టమైన కారు..
సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా ఈ కారు ధర రూ. 6.26 లక్షల నుంచి ప్రారంభమై, గరిష్టంగా రూ. 9.31 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడే వారి కోసం కంపెనీ సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 8.03 లక్షలుగా ఉంది.
మైలేజ్, ఇంజిన్ సామర్థ్యం..
ఈ కారులో 1.2 లీటర్ల 3-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది పెట్రోల్ మీద 82 పీఎస్ పవర్‌ను, సీఎన్‌జీ మీద 70 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే దీనికి సాటి మరొకటి లేదని చెప్పాలి.
పెట్రోల్ మైలేజ్: లీటరుకు 25.71 కిలోమీటర్లు.
సిఎన్‌జి మైలేజ్: కిలోకు 33.73 కిలోమీటర్లు.
ప్రీమియం ఫీచర్లు..
మారుతి ఈసారి ఫీచర్ల విషయంలో ఎక్కడా తగ్గలేదు. మొదటిసారిగా ఈ విభాగంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను ప్రవేశపెట్టింది. దీంతో పాటు 9 అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఈ కారును మరింత ప్రత్యేకంగా మార్చాయి.
భద్రతకు పెద్దపీట: 5-స్టార్ రేటింగ్..
మారుతి కార్లపై గతంలో ఉన్న భద్రతా విమర్శలకు ఈ కొత్త మోడల్ గట్టి సమాధానం ఇచ్చింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా అందించడం విశేషం.
చిన్న లోపాలు..
ఏ కారు కూడా సంపూర్ణంగా ఉండదు. వేగంగా వెళ్లాలనుకునే వారికి డిజైర్ ఇంజిన్ కొంత నెమ్మదిగా అనిపించవచ్చు. అలాగే లోపల ఉపయోగించిన ప్లాస్టిక్ నాణ్యత ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అయినప్పటికీ, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ వంటి పోటీదారులను తట్టుకొని డిజైర్ నేడు మార్కెట్ రారాజుగా నిలిచింది.




