Maruti Suzuki: మారుతి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీపై ఏకంగా రూ.1.85 లక్షల డిస్కౌంట్..త్వరపడండి

Maruti Suzuki: మారుతి సుజుకి గ్రాండ్ విటారాపై సెప్టెంబర్ నెలలో రూ.1.85 లక్షల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

CR Reddy
Published on: 4 Sept 2026 9:59 AM IST
maruti suzuki grand vitara
X

maruti suzuki grand vitara

Maruti Suzuki:పండుగల సీజన్ మొదలవుతున్న వేళ మారుతి సుజుకి తన వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. విభిన్న వేరియంట్లను బట్టి గ్రాండ్ విటారాపై రూ.1,05,000 నుంచి రూ.1,85,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. కన్జ్యూమర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ రాయితీ, కార్పొరేట్ డిస్కౌంట్లు ఈ ఆఫర్‌లో భాగమయ్యాయి. అత్యధికంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై రూ.1.85 లక్షల బెనిఫిట్స్‎తో పాటు రూ.32,320 విలువైన ఉచిత వారంటీ ఆఫర్ ఇస్తున్నారు. సీఎన్‌జీ మోడల్ కొనుగోలు చేసే వారికి రూ.1,05,000 వరకు మేలు చేకూరనుంది.

మూడు పవర్‌ట్రెయిన్ల ఆప్షన్లు

ఇంజిన్ ఆప్షన్ల పరంగా గ్రాండ్ విటారా కస్టమర్లకు చాలా ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో మొదటిది 1.5-లీటర్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్. రెండవది మరింత పవర్ఫుల్ 1.5-లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్. వీటితో పాటు పొదుపైన ప్రయాణం కోరుకునే వారి కోసం 1.5-లీటర్ పెట్రోల్ సీఎన్‌జీ ఆప్షన్ అందుబాటులో ఉంది. డ్రైవర్ల సౌకర్యార్థం ఈ వాహనంలో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను అమర్చారు.

లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజ్

మారుతి గ్రాండ్ విటారా తన అత్యుత్తమ ఇంధన విక్రయ సామర్థ్యంతో లీడింగ్ మోడల్‌గా నిలిచింది. ఏఆర్‌ఏఐ ధ్రువీకరణ ప్రకారం స్ట్రాంగ్ హైబ్రిడ్ (e-CVT) వెర్షన్ లీటరుకు ఏకంగా 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్‌జీ మోడల్ కేజీకి 26.6 కిలోమీటర్లు ఇస్తుండగా, పెట్రోల్ మ్యాన్యువల్ వెర్షన్ 21.11 కిలోమీటర్లు, ఆటోమేటిక్ మోడల్ 20.58 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. సాధారణ ప్రయాణాల్లోనూ సిటీ రోడ్లపై లీటరుకు 15 నుంచి 18 కిలోమీటర్లు, హైవేలపై 18 నుంచి 23 కిలోమీటర్ల వరకు మైలేజ్ రాబట్టవచ్చు.

ప్రీమియం ఫీచర్లు.. సేఫ్టీ

లగ్జరీ ప్రయాణ అనుభూతి కోసం ఈ ఎస్‌యూవీలో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లగ్జరీ ఆంబియంట్ లైటింగ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అమర్చారు. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుపరిచారు. మార్కెట్లో గ్రాండ్ విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.76 లక్షలుగా ఉండగా, టాప్ మోడల్ ధర రూ.19.72 లక్షల వరకు ఉంది. ఈ వాహనం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story