Maruti Suzuki: కిలోకు ఏకంగా 32 కిమీ మైలేజ్.. దేశంలోనే అత్యంత చౌకైన కారు ధర పెంపు

Maruti Suzuki: కారు కొనాలని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలకు మారుతి సుజుకి షాక్ ఇచ్చింది.

CR Reddy
Published on: 10 Sept 2026 11:42 AM IST
Maruti Suzuki
X

Maruti Suzuki

Maruti Suzuki: కారు కొనాలని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలకు మారుతి సుజుకి షాక్ ఇచ్చింది. దేశంలోనే అత్యంత సరసమైన ధరలో లభించే చిన్న కారు ఎస్-ప్రెస్సో ధరను కంపెనీ రూ.2,500 వరకు పెంచింది. ఎంట్రీ లెవెల్ మోడల్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం కస్టమర్లకు కొంత ఊరటనిచ్చే అంశం. మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలోనే కాకుండా దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోనే అత్యంత చౌకైన హ్యాచ్‌బ్యాక్‌గా ఎస్-ప్రెస్సో గుర్తింపు పొందింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.50 లక్షలుగా ఉంది. కంపెనీ తాజాగా కొన్ని వేరియంట్లపై రూ.2,500 వరకు ధరలను పెంచినప్పటికీ, బేస్ వేరియంట్ అయిన ఎస్టీడీ (ఓ) ధరను పాత ప్రకారమే ఉంచింది. దీంతో తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కానుంది.

ఏ ఏ వేరియంట్లపై ధరల పెంపు?

మారుతి ఎస్-ప్రెస్సో మొత్తం 8 వేరియంట్లలో మార్కెట్లో లభిస్తోంది. బేస్ వేరియంట్ మినహా మిగిలిన ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) మ్యాన్యువల్ నుంచి విఎక్స్‌ఐ+ (ఓ) ఆటోమేటిక్ వేరియంట్ల వరకు ఒకే రకంగా రూ.2,500 చొప్పున ధర పెరిగింది. ఈ పెంపుతో ఎస్-ప్రెస్సో కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌లో రూ.5.27 లక్షల వరకు ఉన్నాయి. తక్కువ ధరకుతో పాటు 4.5 మీటర్ల చిన్న టర్నింగ్ రేడియస్, ఎత్తుపల్లాల రోడ్లకు అనుకూలమైన సస్పెన్షన్ ఉండటం ఈ కారు ప్రత్యేకత.

మైలేజ్ రాజా.. ఇంజిన్ సామర్థ్యం ఇలా

ఈ చిన్న కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ అందించారు. ఇది 68 పీఎస్ పవర్, 89 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ మ్యాన్యువల్ వర్షన్ లీటరుకు 24.76 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. సీఎన్‌జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 56.69 పీఎస్ పవర్ ఇస్తూ, కిలో సీఎన్‌జీకి ఏకంగా 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తుంది.

ఫీచర్లు, భద్రత ప్రమాణాలు

తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లను మారుతి ఇందులో సమకూర్చింది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 7 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీ-లెస్ ఎంట్రీ, ఫ్రంట్ పవర్ విండోస్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి వసతులు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుండగా, త్వరలోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అప్‌డేట్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story