ఫుల్ ఛార్జ్‌తో 500 కిమీల జర్నీ.. మారుతి నుంచి గ్రాండ్ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Maruti 7 Seater Electric SUV: పెట్రోల్, సీఎన్‌జీ విభాగాల్లో అల్టిమేట్ ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతి సుజుకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలోనూ తనే టాప్ అనిపించుకోవాలని చూస్తోంది.

Venkat
Published on: 13 Aug 2026 7:31 PM IST
Maruti 7 Seater Electric SUV
X

ఫుల్ ఛార్జ్‌తో 500 కిమీల జర్నీ.. మారుతి నుంచి గ్రాండ్ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Maruti 7 Seater Electric SUV: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని మార్క్‌గా నిలిచిన మారుతి సుజుకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యింది. ఏకంగా 500 కిలోమీటర్లకుపైగా రేంజ్ ఇచ్చే సరికొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ కారును తీర్చిదిద్దుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, పెద్ద కుటుంబాలు ఎంచక్కా సుదీర్ఘ ప్రయాణాలు చేసేలా డిజైన్ చేస్తున్నారు.

పెట్రోల్, సీఎన్‌జీ విభాగాల్లో అల్టిమేట్ ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతి సుజుకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలోనూ తనే టాప్ అనిపించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ-విటారా మోడల్‌తో సందడి చేస్తున్న సంస్థ, తదుపరి అడుగుగా పెద్ద కుటుంబాల కోసం భారీ 7 సీటర్ ఈవీ తీసుకొస్తోంది. వైఎమ్‌సీ (YMC) కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ కారు, మార్కెట్లోకి వస్తే ప్రత్యర్థులంతా పక్కకు తప్పుకోవాల్సిందే అన్నంత రేంజ్‌లో హల్‌చల్ సృష్టిస్తోంది. ఇప్పటికే అర్టిగా మోడల్‌తో ఫ్యామిలీ కార్ల విభాగంలో చెరిగిపోని ముద్ర వేసిన మారుతి, ఈ ఎలక్ట్రిక్ వర్షన్‌తో మరింత మంది వాహనదారులను కవర్ చేసేలా ప్లాన్ వేసింది.

సూపర్ బ్యాటరీ, అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్..

ఈ కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ కారును 'హార్ట్‌టెక్-ఈ' (Heartect-e) ప్లాట్‌ఫారమ్‌పై ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రోజువారీ ప్రయాణాల కోసం 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ, సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారి కోసం 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీని ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లకుపైగా సునాయాసంగా ప్రయాణించవచ్చు. దీనివల్ల దూరప్రాంత ప్రయాణాల్లో చార్జింగ్ స్టేషన్ల గురించిన భయాలు పూర్తిగా తొలగిపోతాయి. డిసి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం 45 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

లగ్జరీ ఫీచర్లు, అధునాతన భద్రత వ్యవస్థ..

కారు లోపల కాలు మోపగానే ప్రీమియం ఫీలింగ్ కలిగేలా మారుతి డిజైన్ చేస్తోంది. పెద్ద ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఆకట్టుకుంటాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా మారుస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఏకంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, లెవెల్-2 అడాస్ (ADAS) సాంకేతికత అందిస్తున్నారు. గుజరాత్‌లోని అత్యాధునిక ప్లాంట్ లోనే ఈ కార్ల తయారీ జరగనుండటంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి కానున్నాయి.

మార్కెట్లో గట్టి పోటీ, ఆకట్టుకునే ధర..!

ఈ ఎలక్ట్రిక్ కారు ఎంట్రీతో టాటా సఫారీ ఈవీ, మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్, కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ వంటి మోడళ్లకు విపరీతమైన పోటీ ఎదురుకానుంది. భారతీయ వినియోగదారుల బడ్జెట్ ఆలోచనలను బాగా తెలిసిన మారుతి, ఈ ఎలక్ట్రిక్ కారును రూ. 20 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరకే పరిచయం చేసేలా సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే భారత్ లో రోడ్డెక్కనున్న ఈ కారు, భారతదేశ ఫ్యామిలీ ఈవీ సెగ్మెంట్‌ను సరికొత్త మలుపు తిప్పడం ఖాయం.

భారతీయ రోడ్లపై భారీ 7 సీటర్ కార్లకు ఉన్న క్రేజ్‌ను ఎలక్ట్రిక్ రూపంలో సొమ్ము చేసుకునేందుకు మారుతి సరిగ్గా పావులు కదుపుతోంది. చౌకైన ధరలో 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తే సామాన్య ప్రయాణికులు ఈవీల వైపు వేగంగా మొగ్గు చూపుతారు. రాబోయే రోజుల్లో ఈ కారు భారత ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు తీసుకురానుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story