Maruti WagonR: కొత్త హంగులు, అండర్‌బాడీ సీఎన్‌జీ.. మార్కెట్లోకి మారుతి వ్యాగన్‌ఆర్ ఫేస్‌లిఫ్ట్

Maruti WagonR: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్ ఎప్పుడూ ముందుంటుంది.

CR Reddy
Published on: 22 Sept 2026 11:26 AM IST
Maruti Suzuki WagonR Facelift
X

Maruti Suzuki WagonR Facelift

Maruti WagonR: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా కంపెనీ ఈ కారుకు మరింత ఆకర్షణీయమైన లుక్ తీసుకొచ్చేందుకు వ్యాగన్‌ఆర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలెనో, స్విఫ్ట్ వంటి కార్లను విజయవంతంగా అప్‌డేట్ చేసిన మారుతి, ఇప్పుడు దేశంలోనే నంబర్-1 హ్యాచ్‌బ్యాక్‌గా ఉన్న వ్యాగన్‌ఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.

ఎక్స్ టీరియర్ డిజైన్, కొత్త హెడ్‌ల్యాంప్స్

కొత్త వ్యాగన్‌ఆర్ ఫేస్‌లిఫ్ట్ కారులో డిజైన్ పరంగా కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కారుకు సిగ్నేచర్ అయిన బాక్సీ, టాల్ బాయ్ లుక్‌ను యథాతథంగా ఉంచినప్పటికీ, ముఖభాగంలో మాత్రం సరికొత్త మార్పులు చేశారు. ఇందులో రెక్టాంగులర్ ఆకారంలో ఉండే కొత్త హెడ్‌ల్యాంప్స్, అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్ అందించారు. దీనివల్ల కారు చూడటానికి మరింత బోల్డ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. అలాగే సైడ్ ప్రొఫైల్, వెనుక భాగంలో కూడా చిన్నపాటి డిజైన్ మార్పులతో పాటు కొత్త రిఫ్లెక్టర్లను అమర్చారు.

అధునాతన ఇంటీరియర్,పెద్ద టచ్‌స్క్రీన్

కారు లోపలి భాగంలో కూడా కస్టమర్లను ఆకట్టుకునేలా పలు అప్‌డేట్లు రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత మోడల్‌లో ఉన్న చిన్న స్క్రీన్ బదులుగా మరింత పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించనున్నారు. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో రానుంది. అలాగే కొత్త అఫోల్స్ట్రీ, మోడర్న్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ కారు లోపలి వాతావరణాన్ని మరింత ప్రీమియంగా మారుస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి.

అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్, బూట్ స్పేస్

ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంజిన్ పరంగా మెరుగైన ఆప్షన్లు లభించనున్నాయి. పెట్రోల్ వెర్షన్‌తో పాటు అత్యంత ఆదరణ పొందిన సీఎన్‌జీ ఆప్షన్ కూడా కొనసాగుతుంది. అయితే అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, సీఎన్‌జీ సిలిండర్‌ను బూట్‌లో కాకుండా అండర్‌బాడీకి మార్చే అవకాశం ఉంది. దీనివల్ల బూట్ స్పేస్ ఎంతో మిగులుతుంది, లగేజ్ సర్దుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా ఏఎంటీ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుండటం విశేషం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.