Mini Cooper: 7 సెకన్లలోపే 100 కిమీ.. భారత మార్కెట్లోకి వచ్చిన మినీ కూపర్ ఆక్స్ఫర్డ్ ఎడిషన్
Mini Cooper: భారతదేశ లగ్జరీ కార్ మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మినీ ఇండియా తన సరికొత్త కూపర్ ఆక్స్ఫర్డ్ ఎడిషన్ వాహనాన్ని అధికారికంగా విడుదల చేసింది.
Mini Cooper Oxford Edition
Mini Cooper: భారతదేశ లగ్జరీ కార్ మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మినీ ఇండియా తన సరికొత్త కూపర్ ఆక్స్ఫర్డ్ ఎడిషన్ వాహనాన్ని అధికారికంగా విడుదల చేసింది. బీఎండబ్ల్యూ గ్రూప్ ఆక్స్ఫర్డ్ ప్లాంట్‌లో ఆధునిక మినీ కార్ల ఉత్పత్తి ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ ప్రత్యేక 3-డోర్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.55.5 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ఈ కారు ప్రీ-బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, కంపెనీ దీని డెలివరీలను కూడా అధికారికంగా ప్రారంభించింది. పరిమిత స్టాక్‌లో మాత్రమే లభించే ఈ లగ్జరీ కారు ఆటోమొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రత్యేక డిజైన్ అలాగే స్టైలింగ్
ఈ ప్రత్యేక ఎడిషన్ కారు డిజైన్ పూర్తిగా బ్రిటన్ జెండా అయిన యూనియన్ జాక్ స్ఫూర్తితో తీర్చిదిద్దారు. ఇండిగో సన్‌సెట్ బ్లూ అలాగే చిల్లీ రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన ఎక్స్ఈరియర్ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. రూఫ్‌పై ఫుల్-సైజ్ యూనియన్ జాక్ డెకల్, గ్రిల్ నుంచి బూట్ లిడ్ వరకు రెడ్ అలాగే వైట్ కలర్ స్ట్రైప్స్ ఇచ్చారు. ORVMs వైట్ ఫినిషింగ్‌తో పాటు 18-ఇంచుల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ ఈ కార్కు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. వెనుక భాగంలో క్రాస్-ఫ్లాగ్ డిజైన్ కలిగిన స్పెషల్ స్టిక్కర్ అమర్చారు.
లగ్జరీ ఇంటీరియర్ అలాగే క్యాబిన్ ప్రత్యేకతలు
ఈ కారు లోపలి భాగం స్టాండర్డ్ మినీ కూపర్ మాదిరిగానే ఉన్నప్పటికీ, దీనికి ప్రత్యేక లుక్ తీసుకురావడానికి గ్రే అలాగే బెయిజ్ కలర్ కాంబినేషన్‌తో పాటు బ్లాక్ జేసీడబ్ల్యూ-స్పెక్ సీట్లు ఇచ్చారు. స్టీరింగ్ వీల్ క్రింది భాగంలో టెక్చర్డ్ ఫ్లాగ్ ప్రింట్, ఫ్లోర్ మ్యాట్స్, స్టీరింగ్ లోగోపై ఆక్స్ఫర్డ్ డోర్ సిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డాష్‌బోర్డ్‌లో 9.4-ఇంచుల గొండ్రటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అంతేకాకుండా కారు చాభి డిజైన్‌లో కూడా బ్రిటిష్ జెండా రూపం కనిపించేలా చాలా ఆకర్షణీయంగా రూపొందించారు.
పవర్ ఫుల్ టర్బో-పెట్రోల్ ఇంజిన్
ఈ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌లో శక్తివంతమైన 2.0-లీటర్ 4-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది అద్భుతమైన 204 హెచ్‌పీ పవర్ అలాగే 300 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ కారు కేవలం 6.6 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. లీటరుకు సుమారు 16.82 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు. స్పీడ్ అలాగే లగ్జరీ కోరుకునే వారికి ఈ కారు చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది.




