Hyundai i20 : హ్యుందాయ్ i20 సరికొత్త అవతారం.. క్రెటా రేంజ్ ఫీచర్లతో రాబోతున్న లగ్జరీ కార్

Hyundai i20 : హ్యుందాయ్ సంస్థ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు i20 న్యూ-జనరేషన్ మోడల్‌ను జులై 2026 లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబోతోంది.

CR Reddy
Published on: 5 Jun 2026 8:41 AM IST
Hyundai i20
X

 Hyundai i20

Hyundai i20 : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ i20 ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమవుతోంది. హ్యుందాయ్ కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ i20 కారును వచ్చే నెల, అంటే జులై 2026 లో గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయబోతోంది. ఈ ప్రతిష్టాత్మక లాంచ్‌కు ముందే కంపెనీ కారుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ తాజా టీజర్ చూస్తుంటే కారు డిజైన్ పరంగా చాలా విప్లవాత్మక మార్పులు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

కొత్త తరం హ్యుందాయ్ i20 లుక్ సాధారణ హ్యాచ్‌బ్యాక్ లా కాకుండా, కొద్దిగా ఎస్‌యూవీ లేదా క్రాస్‌ఓవర్ స్టైల్‌లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ కారును మరింత అగ్రెసివ్‌గా మార్చడానికి బాడీ సైజును కూడా పాత మోడల్ కంటే కొంచెం పెంచినట్లు తెలుస్తోంది. ఇక లైటింగ్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త ఆరో-షేప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌తో పాటు వెనుక వైపు Y షేప్ ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఇవి రెండూ ఒక అందమైన లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడి కారుకు మరింత లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. టెస్టింగ్ సమయంలో ఈ కారులో పెద్ద 17-ఇంచ్ టైర్లను, టాప్ వేరియంట్లలో సరికొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్‌ను గుర్తించారు.

ఫీచర్ల పరంగా ఈ కొత్త కారును హ్యుందాయ్ తన పాపులర్ ఎస్‌యూవీ క్రెటా రేంజ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. కారు లోపల క్రేటా తరహాలోనే పెద్ద సైజు కర్వ్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే స్క్రీన్ ఉండబోతోంది. దీంతో పాటు సరికొత్త డిజైన్ ఉన్న స్టీరింగ్ వీల్, అడ్వాన్స్డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా జోడించారు. అన్నిటికంటే ముఖ్యంగా కస్టమర్ల రక్షణ కోసం ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌ను కూడా అందించనున్నారు. పార్కింగ్‌ను మరింత సులభతరం చేయడానికి ముందు, వెనుక భాగాలలో పార్కింగ్ సెన్సార్లతో పాటు హై-క్లారిటీ రియర్ కెమెరా కూడా ఇందులో ఉండబోతోంది.

భారతదేశంలో లాంచ్ కాబోయే కొత్త i20 మోడల్ ఇంజన్ పరంగా ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇందులో పాత మోడల్ లాగే నమ్మకమైన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే, గ్లోబల్ మార్కెట్ కోసం మాత్రం హ్యుందాయ్ సంస్థ మరింత మైలేజ్ ఇచ్చే మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్, బ్యాటరీ) ఇంజన్ ఆప్షన్లను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

భారతదేశంలో హ్యుందాయ్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్, మార్కెట్ వాటా చాలా పెద్దది. అందువల్ల జులై నెలలో గ్లోబల్ మార్కెట్లో ఈ కారును అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే భారతీయ మార్కెట్లోకి కూడా రంగప్రవేశం చేయించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రీమియం ఫీచర్లు, ఎస్‌యూవీ లాంటి లుక్స్, నమ్మకమైన హ్యుందాయ్ బ్రాండ్ వాల్యూ తో రాబోతున్న ఈ సరికొత్త i20 భారతీయ మార్కెట్లో మారుతి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story