Next-Gen Hyundai i20 : సరికొత్త లుక్‌తో హ్యుందాయ్ i20.. ఇండియాలోకి ఎప్పుడు రాబోతుందంటే ?

Next-Gen Hyundai i20 : హ్యుందాయ్ సంస్థ తన నాలుగో తరం న్యూ జనరేషన్ ఐ20 కారును గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది.

CR Reddy
Published on: 15 Jun 2026 8:40 AM IST
Next-Gen Hyundai i20
X

Next-Gen Hyundai i20

Next-Gen Hyundai i20 : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కార్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన మోస్ట్ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20 లో నాలుగో తరం మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ ఈ సరికొత్త కారును మొదటిసారిగా బ్రెజిల్ మార్కెట్లో ప్రదర్శనకు ఉంచింది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ న్యూ జనరేషన్ కారు డిజైన్ పరంగా, లగ్జరీ ఫీచర్ల పరంగా ఎన్నో అద్భుతమైన మార్పులతో సరికొత్తగా ముస్తాబయింది.

ఇండియాలోకి ఎప్పుడు రానుంది?

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో సందడి చేస్తున్న ఈ సరికొత్త హ్యుందాయ్ ఐ20 కారు భారత మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కారును భారత మార్కెట్లో 2027వ సంవత్సరం ఆరంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోని పోటీని ఈ సరికొత్త మోడల్ మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మునుపటి కంటే మరింత స్టైలిష్ అండ్ బిగ్గర్

కొత్త జనరేషన్ హ్యుందాయ్ i20 కారును పూర్తిగా సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో రూపొందించారు. కారు ముందు భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ ఎయిర్ ఇన్‌టేక్ డిజైన్ ఇచ్చారు. ఇవి కారుకు రోడ్డుపై మంచి రాచరికపు లుక్‌ను తెచ్చిపెడతాయి. కారు పక్క భాగం బాక్సీ డిజైన్‌తో, వీల్ ఆర్చ్ క్లాడింగ్‌తో అద్భుతంగా ఉంది. బ్రెజిల్‌లో ప్రదర్శించిన మోడల్‌లో 17-ఇంచుల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. కారు వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్ కారు స్టైల్‌ను మరింత పెంచాయి.

కేబిన్ లోపల హైటెక్ లగ్జరీ ఎక్స్‌పీరియన్స్

కారు బాహ్య రూపమే కాకుండా లోపలి భాగం కూడా పూర్తిగా మారిపోయింది. ఇందులో విలాసవంతమైన కార్లలో మాత్రమే కనిపించే కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 12.3-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరో 12.3-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిసి ఉంటాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్యాడల్ షిఫ్టర్లు, పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కారుకు స్పోర్టీ ఫీల్ ఇచ్చేలా ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను అందించారు. వినియోగదారులు తమకు నచ్చిన కలర్ థీమ్‌ను కేబిన్ లోపల సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.

లెవెల్ 2 ADAS టెక్నాలజీతో హై సెక్యూరిటీ

ఈ సరికొత్త కారులో హ్యుందాయ్ సంస్థ ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో అడ్వాన్స్‌డ్ లెవెల్ 2 ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్‌ను అమర్చారు. ఇది డ్రైవర్‌ను ప్రమాదాల బారి నుంచి ముందుగానే హెచ్చరిస్తుంది. దీనితో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కారు నియంత్రణ మరింత పటిష్టంగా ఉండేందుకు కారు నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందించారు.

పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు

ఇండియాలో లాంచ్ కాబోయే మోడల్ ఇంజన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ప్రస్తుత నివేదికల ప్రకారం ఇండియాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అలాగే ఐ20 ఎన్ లైన్ మోడల్ కోసం ఇచ్చే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఇందులోనూ కొనసాగించే అవకాశం ఉంది. బ్రెజిల్ మోడల్‌లో 1.0 లీటర్ నార్మల్, టర్బో పెట్రోల్ ఇంజన్లను ఇచ్చారు. భారత మార్కెట్లోకి వచ్చే సమయానికి కాలుష్య నిబంధనలకు అనుగుణంగా పవర్‌ట్రెయిన్‌లో మరికొన్ని చిన్న మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనప్పటికీ కొత్త ఐ20 లుక్, ఫీచర్లు, సేఫ్టీ పరంగా పాత కార్ల కంటే చాలా ముందుంటుందని చెప్పవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story