Electric Scooter: సింగిల్ ఛార్జ్‌తో 100 కిమీ రేంజ్.. త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

Electric Scooter: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు జావా యెజ్దీ మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి సరికొత్త అస్త్రాన్ని దింపింది.

CR Reddy
Published on: 10 Sept 2026 11:35 AM IST
jawa 42
X

jawa 42

Electric Scooter: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు జావా యెజ్దీ మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి సరికొత్త అస్త్రాన్ని దింపింది. ఆకర్షణీయమైన డిజైన్, మస్కులర్ లుక్‌తో కూడిన జావా 42 ఆల్ స్టార్స్ బైక్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.79 లక్షలుగా నిర్ణయించారు. భారత మార్కెట్లో 2018లో అడుగుపెట్టిన జావా 42 మోడల్‌కు సంబంధించి ఇప్పటివరకు ఇదే అత్యంత భారీ అప్‌డేట్ కావడం విశేషం. మోడ్రన్ క్లాసిక్ గుర్తింపును అలాగే కాపాడుకుంటూనే, మరింత బోల్డ్, మస్కులర్ లుక్‌తో ఈ బైక్‌ను తీర్చిదిద్దారు. కొత్త డిజైన్ కలిగిన సైడ్ ప్యానెల్స్, వెడల్పాటి ఫ్రంట్, రియర్ టైర్లు, అప్‌స్వెప్ట్ ట్విన్ ఎగ్జాస్ట్ మఫ్లర్‌లు ఈ వాహనానికి రోడ్డుపై రాజసం తెచ్చిపెడుతున్నాయి. వెనుక వైపు 150/70-17 సైజు టైరుతో పాటు సరికొత్త ఫెండర్‌ను అమర్చడం వల్ల ఈ బైక్ వెనుక నుంచి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది.

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రత్యేక మార్పులు

జావా తన సిగ్నేచర్ ఫ్లాట్ బెంచ్ డిజైన్‌ను కొనసాగిస్తూనే, 790 మిమీ సీటు ఎత్తును మెరుగైన కుషనింగ్‌తో ఆకర్షణీయంగా మలిచింది. డిజైన్ మార్పులతో పాటు వాహనం ఫ్రేమ్ గట్టిదనం, స్వింగ్‌ఆర్మ్, బరువు సమతుల్యతలో కంపెనీ గణనీయమైన మెరుగుదలలు చేసింది. ఫలితంగా పట్టణాల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఉన్నప్పటికీ బైక్‌ను చాలా సులువుగా నియంత్రించవచ్చు. రైడింగ్ పొజిషన్ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది చక్కటి అనుభవాన్ని అందిస్తుంది.

పవర్‌ఫుల్ ఇంజిన్, భద్రతా ప్రమాణాలు

ఈ మోటార్ సైకిల్‌లో 294.72 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ డిఓహెచ్‌సి ఇంజిన్ అందించారు. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు. బ్రేకింగ్ వ్యవస్థ విషయానికి వస్తే, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు అమర్చడమే కాకుండా ప్రామాణికంగా డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ మోడల్ విడుదలతో జావా ఆల్ స్టార్స్ శ్రేణి పూర్తయినట్లయింది. ఇందులో ఇప్పటికే స్పోర్టీ జావా 42 ఎఫ్‌జి, 42 బాబర్ మోడళ్లు విక్రయమవుతున్నాయి.

ధరలు, బుకింగ్స్, డెలివరీ వివరాలు

సరికొత్త జావా 42 ఆల్ స్టార్స్ మొత్తం 6 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1,79,942 నుంచి ప్రారంభమై రూ.1,89,942 వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్దీ షోరూమ్‌లలో బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పండుగ సీజన్ ప్రారంభానికి ముందే, అంటే సెప్టెంబర్ 14, 2026 నుంచి కస్టమర్లకు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. భారత మార్కెట్లో ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, హంటర్ 350, హోండా సీబీ350 వంటి పాపులర్ మోడళ్లకు నేరుగా పోటీ ఇవ్వనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story