Mercedes : 600 బిహెచ్‌పి పవర్, రాయల్ లుక్స్.. మెర్సిడెస్ కొత్త కారు వచ్చేస్తోంది

Mercedes : మెర్సిడెస్-మేబ్యాక్ GLS ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేసింది.. 600 bhp V8 ఇంజిన్, AI టెక్నాలజీ, మెరుగైన లగ్జరీ ఫీచర్లతో విడుదలైంది.

CR Reddy
Published on: 23 July 2026 9:54 AM IST
Mercedes Benz
X

Mercedes Benz

Mercedes : జర్మన్ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన అత్యంత విలాసవంతమైన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మెర్సిడెస్-మేబ్యాక్ GLS మోడల్‌లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇది మిడ్-లైఫ్ అప్‌డేట్ కావడంతో డిజైన్, టెక్నాలజీ, మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ సహా లోపలి భాగంలో ఎన్నో లగ్జరీ ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను మునుపటి కంటే మరింత రాయల్‌గా రూపుదిద్దింది.

ఈ ఎస్‌యూవీలోని మేబ్యాక్-స్పెసిఫిక్ ఫ్రంట్ గ్రిల్ చుట్టూ ఇప్పుడు వెలిగే బార్డర్‌ను అందించారు. దీంతోపాటు మొదటిసారిగా గ్రిల్‌పై మేబ్యాక్ బ్రాండింగ్‌ కూడా వెలిగేలా అమర్చారు. హెడ్‌లైట్లలో రోజ్-గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి వినూత్నంగా డిజైన్ చేయగా, వెనుకవైపు కొత్త శైలి టెయిల్ లైట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ కారులో కొత్తగా 22-ఇంచ్, 23-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో పాటు సరికొత్త డ్యూయల్-టోన్ రంగులను కూడా ప్రవేశపెట్టారు.

కేబిన్ విషయానికి వస్తే.. ఇందులో కస్టమర్లను మంత్రముగ్ధులను చేసే మార్పులు చేశారు. సరికొత్త నాప్పా లెదర్ అపోల్స్టరీ, ప్రీమియం ఇంటీరియర్ ట్రిమ్ ఫినిషింగ్‌లు ఇందులో లభిస్తాయి. ముందు, వెనుక సీట్లలో అప్‌గ్రేడెడ్ మసాజ్ ఫంక్షన్ అందుబాటులోకి వచ్చింది. కేబిన్ శబ్దాలు బయటకు వెళ్లకుండా సౌండ్ ఇన్సులేషన్‌ను, గాలిని శుభ్రపరిచే ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ను మెరుగుపరచడంతో పాటు 15-స్పికర్ల బర్మెస్టర్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను జతచేశారు.

ఇంజిన్ పరంగా చూస్తే.. ఈ ఎస్‌యూవీలో అప్‌డేట్ చేసిన 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌ను 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో అనుసంధానించారు. ఇది 600 bhp పవర్, 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అవసరమైన సందర్భంలో స్టార్టర్ జెనరేటర్ ద్వారా అదనంగా మరో 23 bhp పవర్ లభిస్తుంది. ఇది కారు వేగాన్ని, పర్‌ఫార్మెన్స్‌ను మరింత వేగవంతం చేస్తుంది.

అంతేకాకుండా.. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో మెర్సిడెస్ సరికొత్త MB.OS ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. AI సామర్థ్యాలు ఉన్న వాయిస్ అసిస్టెంట్‌తో MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పనిచేస్తుంది. డ్రైవింగ్ భద్రత కోసం లెవెల్-2 డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ లగ్జరీ కారు విక్రయాలు ప్రస్తుతం చైనాలో ప్రారంభం కాగా ఈ ఏడాది చివర్లో అమెరికా, యూరప్‌, భారత్ లలో అందుబాటులోకి రానున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story