Hyundai Creta: పెళ్లి కూతురిలా ముస్తాబై రాబోతున్న హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta: భారత మార్కెట్‌లో 20 లక్షల విక్రయాలు దాటిన హ్యుందాయ్ క్రెటా త్వరలో థర్డ్-జనరేషన్ మోడల్‌గా రానుంది.
Hyundai Creta
Hyundai Creta: భారత ఆటోమొబైల్ రంగానికి చెందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా తన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జూలై 2015లో భారత రహదారులపై అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఈ పాపులర్ ఎస్‌యూవీ ఏకంగా 20 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నది సెకండ్-జనరేషన్ క్రెటా మోడల్. అయితే, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి హ్యుందాయ్ కంపెనీ ఒక సంచలన వార్త అందించింది. ఈ పాపులర్ ఎస్‌యూవీలో థర్డ్-జనరేషన్ మోడల్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
సరికొత్త K3 ప్లాట్‌ఫామ్‌పై నిర్మాణం
నెక్స్ట్-జనరేషన్ హ్యుందాయ్ క్రెటా పాత రెండు జనరేషన్లతో పోలిస్తే డిజైన్, ఇంజనీరింగ్ పరంగా పూర్తిగా భిన్నంగా, అత్యంత అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది. ఈ ఎస్‌యూవీని పూర్తిగా కొత్త K3 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ కారణంగా కారు సైజు పూర్వపు మోడల్ కంటే పెరగనుంది. ఫలితంగా కారు లోపల ప్రయాణికులకు ఎక్కువ లెగ్‌స్పేస్, మెరుగైన సౌకర్యం లభించనున్నాయి. అంతేకాకుండా ఈ కారు బాడీని మరింత బలంగా మార్చేందుకు అత్యున్నత నాణ్యత కలిగిన హై-స్ట్రెంగ్త్ స్టీల్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు.
ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌టీరియర్, హైటెక్ ఇంటీరియర్
స్పై షాట్ల ద్వారా లభించిన వివరాల ప్రకారం.. కొత్త క్రెటా పొడవును గణనీయంగా పెంచారు. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ 2025 ఎల్ఏ ఆటో షోలో ప్రదర్శించిన హ్యుందాయ్ క్రేటర్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతోంది. కారులో సన్నటి స్లీక్ లైట్లు, ఎత్తైన ఫ్లాట్ బోనెట్, మస్కులర్ వీల్ ఆర్చ్‌లు, పదునైన క్యారెక్టర్ లైన్లు ఉండనున్నాయి. కేబిన్ విషయానికి వస్తే హ్యుందాయ్ గ్లోబల్ మోడళ్లయిన అయోనిక్ 3, కొత్త ఎలాంట్రా తరహాలో డిజైన్ చేయనున్నారు. ఇందులో 9.9-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్‌పై పనిచేసే 12.9-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, స్మార్ట్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ పవర్డ్ సీట్స్ లభించనున్నాయి.
పవర్‌ట్రెయిన్, లాంచ్ అప్‌డేట్
భద్రతకు ప్రాధాన్యతనిస్తూ లెవెల్-2 ADAS కూడా ఈ కారులో అందించనున్నారు. ఇంజిన్ విషయానికి వస్తే 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ 4-సిలిండర్ ఇంజిన్‌తో పాటు పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్ ఆప్షన్లలో లభించనుంది. దీనితో పాటు ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ కూడా తీసుకురానున్నారు. అయితే కఠినతరం అవుతున్న ఉద్గార నిబంధనల కారణాల వల్ల ప్రస్తుత డీజిల్ ఇంజిన్ కొనసాగడం కష్టమేనని భావిస్తున్నారు. ఈ నెక్స్ట్-జెన్ క్రెటాను 2027 మధ్యనాటికి భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది.




