Tata Nexon: నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్ లీక్డ్ వీడియో.. వెనుక డిస్క్ బ్రేకులు, మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు

Tata Nexon: భారతీయ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందిన మోడళ్లలో టాటా నెక్సాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

CR Reddy
Published on: 26 Oct 2026 1:33 PM IST
Tata Nexon
X

Tata Nexon

Tata Nexon: భారతీయ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందిన మోడళ్లలో టాటా నెక్సాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సేఫ్టీ, స్టైలిష్ డిజైన్‌తో కస్టమర్ల మనసులు గెలుచుకున్న ఈ కారుకు సంబంధించి టాటా మోటార్స్ తదుపరి తరం మోడల్‌ను రూపొందించే పనిలో ఉంది. అంతర్గతంగా ప్రాజెక్ట్ గరుడ్ అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ నయా ఎస్‌యూవీ టెస్టింగ్ మోడల్ ఇటీవల రోడ్లపై ప్రత్యక్షమైంది. లడఖ్ కొండప్రాంతాల్లో సుదీర్ఘకాలం పాటు సాగిన కఠినమైన పరీక్షల అనంతరం పూణే వైపు వెళ్తుండగా ఈ కారును ఆటోమొబైల్ అభిమానులు గుర్తించి వీడియో తీశారు. 2027 నాటికి ఈ కారు అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆకట్టుకునే కొత్త డిజైన్, ఆల్-డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్

తాజాగా లీకైన వీడియో ప్రకారం కొత్త నెక్సాన్ సైజు ప్రస్తుత మోడల్ మాదిరిగానే 4 మీటర్ల లోపు ఉండనుంది. అయితే ముందు భాగంలో మరింత టాల్, అప్‌రైట్ బోనెట్, పెద్ద ఎయిర్ వెంట్స్‌తో అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చారు. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ కొనసాగుతుండగా, టాటా కర్వ్ నుంచి ప్రేరణ పొందిన మల్టీ-స్పోక్ అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యంత ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఈ టెస్ట్ మోడల్‌లో వెనుక చక్రాలకు కూడా డిస్క్ బ్రేకులు అమర్చి ఉన్నాయి. దీనివల్ల కారు బ్రేకింగ్ సామర్థ్యం, ప్రయాణికుల భద్రత మరింత మెరుగవుతాయని ఆటో రంగా నిపుణులు చెబుతున్నారు.

హంగులతో నిండిన సరికొత్త కేబిన్ ఫీచర్లు

ఇంటీరియర్ పరంగా నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్‌లో భారీ అప్‌డేట్లు రాబోతున్నాయి. పెద్ద సైజ్ క్యూఎల్ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఐఆర్‌విఎమ్ , వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డాల్బీ ఆడియో సిస్టమ్, కెమెరా వాషర్ వంటి ఎన్నో లగ్జరీ సౌకర్యాలు లభించే సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో రానుంది. అంతేకాకుండా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సేఫ్టీ ఫీచర్‌ను కూడా ఈ కొత్త వేరియంట్‌లో చేర్చే ఆలోచనలో టాటా ఇంజనీర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంజిన్ ఆప్షన్లు అలాగే భవిష్యత్తు కార్యాచరణ

పవర్ ట్రెయిన్ విషయానికొస్తే, ప్రస్తుత 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (120PS power, 170Nm torque) తో పాటు జంట సిలిండర్ టెక్నాలజీతో కూడిన టర్బో సిఎన్‌జి వెర్షన్లు కొనసాగనున్నాయి. అయితే రాబోయే కఠినమైన ఉద్గార నిబంధనల దృష్ట్యా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఐసీఈ వెర్షన్ లాంచ్ అయిన కొద్దిరోజులకే ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన నెక్సాన్ ఈవీ కూడా ఇదే డిజైన్ ల్యాంగ్వేజ్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.