Nissan Magnite: సొంత కారు కొనక్కర్లేదు.. నెలకు రూ. 9,399 చెల్లిస్తే చాలు.. మీ ఇంటికే నిస్సాన్ మాగ్నైట్..!
Nissan Magnite subscription: ఎటువంటి డౌన్ పేమెంట్ భారం లేకుండా అధునాతన ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే వారికి నిస్సాన్ అందిస్తున్న ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ పథకం ద్వారా మధ్యతరగతి కుటుంబాల కారు కల సులభంగా నెరవేరుతుంది.
5. Nissan Magnite: సొంత కారు కొనక్కర్లేదు.. నెలకు రూ. 9,399 చెల్లిస్తే చాలు.. మీ ఇంటికే నిస్సాన్ మాగ్నైట్..!
Nissan Magnite and Gravite Subscription Plan: కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ భారీగా డబ్బులు సమకూర్చడం లేదా ఏళ్ల తరబడి ఈఎంఐలు కట్టడం అందరికీ సాధ్యం కాదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జపనీస్ కార్ల దిగ్గజం నిస్సాన్ మోటార్ ఇండియా ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. నిస్సాన్ మాగ్నైట్, గ్రావిటీ కార్లను ఇప్పుడు కేవలం నెలకు రూ. 9,399 సబ్‌స్క్రిప్షన్ చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఎటువంటి భారీ పెట్టుబడి లేకుండా కొత్త కారు నడపాలనే వారికి ఇదొక గొప్ప అవకాశం.
అద్దెకే అధునాతన కార్లు..
నిస్సాన్ సంస్థ 'అవిస్ ఇండియా'తో చేతులు కలిపి ఈ లీజింగ్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఆఫీసు అవసరాల కోసం లేదా వ్యాపార పనుల కోసం కార్లు కావాలనుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కారును పూర్తిగా కొనుగోలు చేసే బదులు, ఇలా నెలవారీ చందా పద్ధతిలో తీసుకోవడం వల్ల ఆరంభంలో అయ్యే లక్షల రూపాయల ఖర్చు తప్పుతుంది. ఈ పథకం ద్వారా నిస్సాన్ మాగ్నైట్, కొత్తగా వచ్చిన గ్రావిటీ కార్లను వినియోగదారులు ఎంచుకోవచ్చు.
ఆఫర్లు..
ఈ ప్లాన్ కింద వినియోగదారులు గరిష్టంగా 60 నెలల వరకు కారును తమ వద్ద ఉంచుకోవచ్చు. అలాగే సుమారు 50,000 కిలోమీటర్ల వరకు వినియోగించుకునే వెసులుబాటును కంపెనీ కల్పించింది. నెలకు రూ. 9,399 (పన్నులు అదనం) నుంచి ప్రారంభమయ్యే ఈ ధర చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు ఎంతో పొదుపుగా ఉంటుంది. ఈ భాగస్వామ్యంలో కారు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సర్వీస్ నిర్వహణ బాధ్యతలన్నీ అవిస్ ఇండియా సంస్థే చూసుకుంటుంది. అంటే, వినియోగదారులు నిర్వహణ ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మారుతున్న జీవనశైలి..
భారతదేశంలో ఇప్పుడు సొంతంగా ఆస్తులను కూడబెట్టుకోవడం కంటే, తక్కువ ఖర్చుతో వాటిని వాడుకోవడం (లీజింగ్) అనే సంస్కృతి పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను నిస్సాన్ సరిగ్గా అందిపుచ్చుకుంది. కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసినా, సర్వీస్ చేయించాలన్నా కంపెనీయే బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి, వినియోగదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. మొత్తానికి, నిస్సాన్ ప్రవేశపెట్టిన ఈ సరికొత్త విధానం మధ్యతరగతి ప్రజలకు, కార్పొరేట్ సంస్థలకు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.




