Nissan Tekton: సఫారీ, అల్కాజార్‌లకు చెక్ పెట్టేందుకు వస్తున్న నిస్సాన్ కొత్త 7-సీటర్ SUV

Nissan Tekton: ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో సరికొత్త SUVని దించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

CR Reddy
Published on: 9 Oct 2026 9:19 AM IST
Nissan Tekton
X

Nissan Tekton

Nissan Tekton: ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో సరికొత్త SUVని దించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన టెక్టాన్ 5-సీటర్ మోడల్ ఆధారంగా 7-సీటర్ వెర్షన్‌ను రూపొందిస్తోంది. ఇటీవల ఈ కారును రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా తీసిన స్పై చిత్రాలు బయటకు వచ్చాయి. నిస్సాన్ ఇండియా భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా రూపొందుతున్న ఈ కారు విశాలమైన కేబిన్ స్పేస్‌తో రానుంది.

ఈ కొత్త 7-సీటర్ SUV డిజైన్ టెక్టాన్ 5-సీటర్ మాదిరిగానే ఉన్నప్పటికీ, మూడో వరుస ప్రయాణీకులకు చోటు కల్పించడానికి వీలుగా దీని బాడీని కాస్త పొడవుగా మార్చారు. ఈ వాహనం దాదాపు 2,657 మిమీ వీల్‌బేస్‌ కలిగి ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో తిరగేసిన L-ఆకారంలో ఉండే LED DRLలు, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, వర్టికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారుకి మరింత రాజసాన్ని తెచ్చిపెట్టాయి.

వాహనం వెనుక భాగంలో సరికొత్త కనెక్టెడ్ LED టెయిల్-లైట్ డిజైన్‌ను అమర్చారు. నంబర్ ప్లేట్‌ను బంపర్ పై కింద భాగంలో ఉంచడం ద్వారా ఈ 7-సీటర్ మోడల్‌ను 5-సీటర్ వెర్షన్ నుంచి సులభంగా గుర్తించవచ్చు. సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముందు బంపర్‌పై మిల్లీమీటర్-వేవ్ రాడార్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వార్నింగ్ వంటి 17కి పైగా అడ్వాన్సుడ్ ADAS ఫీచర్లు ఇందులో లభించనున్నాయి.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే 163 PS పవర్, 280 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ వెట్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మైలేజ్, పర్‌ఫార్మెన్స్ పరంగా ఈ ఇంజిన్ చాలా మెరుగ్గా పనిచేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

భారత మార్కెట్లో ఈ 7-సీటర్ SUV అంచనా ధర రూ.18 లక్షల వద్ద ఉండే అవకాశం ఉంది. ఇది అధికారికంగా లాంచ్ అయిన తర్వాత టాటా సఫారీ, మహీంద్రా XUV 7XO, హ్యుందాయ్ అల్కాజార్ వంటి పాపులర్ మోడళ్లకు మార్కెట్లో తీవ్రమైన పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన లుక్స్, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే కుటుంబాలకు ఈ కొత్త కారు ఒక మంచి ఎంపిక కానుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.