Oben Electric: బుకింగ్స్ ప్రారంభించిన 15 రోజుల్లోనే 25,000 మార్క్ దాటిన ఓబెన్ రోర్ ఈజెడ్!

Oben Electric: ప్రముఖ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ సంస్థ ‘ఓబెన్‌ ఎలక్ట్రిక్‌’ తెలుగు రాష్ట్రాల్లో భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది.

RAJESH,	WEST ZONE
Published on: 25 May 2026 8:50 PM IST
Oben Electric
X

Oben Electric: బుకింగ్స్ ప్రారంభించిన 15 రోజుల్లోనే 25,000 మార్క్ దాటిన ఓబెన్ రోర్ ఈజెడ్!

Oben Electric: ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ కంపెనీ ఓబెన్‌ ఎలక్ట్రిక్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. విస్తరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కొత్తగా 20 షోరూమ్‌లను ఏర్పాటు చేయటంతో పాటు ఏపీలో మరో 10 షోరూమ్స్‌ను ప్రారంభించనున్నట్లు సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ హర్షవర్ధన్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ తెలంగాణలో ఐదు, ఏపీలో 4 షోరూమ్స్‌ను నిర్వహిస్తోందన్నారు. కాగా కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చిన ఓబెన్‌ రోర్‌ ఇవోకి ఇక్కడి మార్కెట్లో మంచి స్పందన లభిస్తోందన్నారు.

ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభించిన 15 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 25,000కు పైగా బుకింగ్స్‌ రాగా ఇందులో హైదరాబాద్‌ నుంచి 2,000కు పైగా బుకింగ్స్‌ వచ్చాయన్నారు. 3.4 కేడబ్ల్యూహెచ్‌ ఎల్‌ఎ్‌ఫపీ బ్యాటరీతో కూడిన ఈ బైక్‌ ఒకసారి చార్జింగ్‌తో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెప్పారు. జూన్‌ నుంచి డెలివరీ ప్రారంభించనున్న రోర్‌ ఇవో ధర రూ.1,24,999 (ఎక్స్‌షోరూమ్‌) అని దేశ్‌ముఖ్‌ తెలిపారు. బెంగళూరులో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో రోర్‌ బైక్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు దేశ్‌ముఖ్‌ చెప్పారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story