Ola Sona Weekend Sale: అక్షయ తృతీయ స్పెషల్.. కేవలం రూ.49,999 కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే ఆఫర్లు..!
Ola Sona Weekend Sale: అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ.50 వేల వరకు డిస్కౌంట్, 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ మరియు లక్కీ డ్రా ద్వారా స్పెషల్ ఎడిషన్ గెలుచుకునే అవకాశం.
Ola Sona Weekend Sale: అక్షయ తృతీయ స్పెషల్.. కేవలం రూ.49,999 కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే ఆఫర్లు..!
Ola Sona Weekend Sale: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్, అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఓలా సోనా వీకెండ్‘ సేల్‌ను ప్రారంభించింది. ఈ శని, ఆదివారాల్లో (ఏప్రిల్ 18, 19) వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.50,000 వరకు భారీ తగ్గింపును అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఆఫర్ల వివరాలు:
నేరుగా తగ్గింపు: కొత్త వాహనాల కొనుగోలుపై రూ.40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి.
బ్యాంక్ ఆఫర్లు: బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై అదనంగా రూ.10,000 డిస్కౌంట్ పొందవచ్చు.
ప్రారంభ ధర: జెన్ 3 ఎస్1 ఎక్స్ (2kWh) మరియు రోడ్‌స్టర్ ఎక్స్ (2.5 kWh) మోడళ్లు కేవలం రూ.49,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉన్నాయి.
బంపర్ డిస్కౌంట్: రోడ్‌స్టర్ X+ (9.1 kWh) బైక్‌పై ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించింది. దీంతో దీని ధర రూ.1,39,999కి తగ్గింది.
అదనపు ప్రయోజనాలు:
ఈ వీకెండ్ ఆఫర్‌లో వాహనం కొనుగోలు చేసిన వారికి 8 ఏళ్ల పాటు ఉచిత బ్యాటరీ వారంటీని కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, లక్కీ డ్రా ద్వారా ఎంపికైన విజేతకు ప్రత్యేకమైన 'ఓలా సోనా స్పెషల్ ఎడిషన్'ను బహుమతిగా ఇవ్వనుంది. భారత్ సెల్ (4680) సాంకేతికతతో రూపొందించిన రోడ్‌స్టర్ X+ 9.1 కొనుగోలు గడువును కూడా కంపెనీ పొడిగించింది.




