Upcoming Cars: కొత్త కార్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. రాబోయే 10 రోజుల్లో మార్కెట్లోకి 5 అద్భుతమైన కార్లు
Upcoming Cars: మీరు త్వరలో కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అయితే కొన్ని రోజులు ఆగడం మంచింది.
Tata Aeris
Upcoming Cars: మీరు త్వరలో కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అయితే కొన్ని రోజులు ఆగడం మంచింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేయడానికి దేశ విదేశీ ఆటోమొబైల్ దిగ్గజాలు సిద్ధమయ్యాయి. రాబోయే పది రోజుల్లో భారతీయ మార్కెట్లోకి ఏకంగా ఐదు సరికొత్త కార్లు విడుదల కాబోతున్నాయి. వీటిలో టాటా, రెనాల్ట్, స్కోడా, హోండా వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి రానున్న ఫేస్‌లిఫ్ట్, కొత్త మోడల్స్ ఉన్నాయి. మరి ఆ కార్లు ఏంటో, వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
టాటా నుంచి ఏరిస్, ఏరిస్.ఈవీ
ప్రముఖ దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన పాపులర్ సెడాన్ కారు టిగోర్ స్థానంలో సరికొత్త ఏరిస్, ఏరిస్.ఈవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఏరిస్ కారు సరికొత్త డిజైన్, స్లిమ్మర్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో రానుంది. ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి. ఇది 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభించనుంది. అలాగే ఇదే రోజు లాంచ్ కానున్న ఏరిస్.ఈవీ ఎలక్ట్రిక్ సెడాన్ సింగిల్ ఛార్జ్‌పై అద్భుతమైన రేంజ్‌ను అందించడంతో పాటు, అత్యాధునిక కనెక్టెడ్ టెయిల్ లైట్ డిజైన్‌ను కలిగి ఉండనుంది.
పవర్‌ఫుల్ ఇంజిన్‌తో రానున్న రెనాల్ట్ ట్రైబర్ టర్బో
ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ తన పాపులర్ 7-సీటర్ ఎమ్‌పీవీ ట్రైబర్లో ఉన్న పవర్ కొరత సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న రెనాల్ట్ ట్రైబర్ టర్బో మోడల్‌లో 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు. ఇది మరింత మెరుగైన పవర్‌ను ఉత్పత్తి చేయనుంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఇది లభించనుంది. అంతేకాకుండా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా ఇది అందుబాటులోకి రానుండటం కుటుంబాలకు మరింత ప్రయోజనకరంగా మారనుంది.
అప్‌డేటెడ్ ఫీచర్లతో స్కోడా స్లావియా, హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్
లగ్జరీ మరియు సేఫ్టీకి పేరుగాంచిన స్కోడా సంస్థ తమ స్లావియా ఫేస్‌లిఫ్ట్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో కొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, సరికొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా సెగ్మెంట్‌లో తొలిసారిగా రేర్ సీట్ మసాజ్ ఫంక్షన్, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. ఇక అక్టోబర్ ప్రారంభంలో విడుదల కానున్న హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో కూడా కొత్త గ్రిల్, బంపర్స్, పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, అప్‌డేటెడ్ ఏడీఏఎస్ భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.




