Range Rover GT వచ్చేస్తోంది.. ఇంటీరియర్ చూస్తే లగ్జరీకి కొత్త నిర్వచనం ఇదే.!

Range Rover GT : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రేంజ్ రోవర్ తన ఖాతాలో ఐదో కార్ మోడల్‌గా 'రేంజ్ రోవర్ జిటి' (Range Rover GT) ని అధికారికంగా మార్కెట్‌లోకి,,,

G Krishna
Published on: 23 July 2026 12:56 PM IST
Range Rover GT
X

Range Rover GT

Range Rover GT : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రేంజ్ రోవర్ తన ఖాతాలో ఐదో కార్ మోడల్‌గా 'రేంజ్ రోవర్ జిటి' (Range Rover GT) ని అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ బ్రాండ్ హిస్టరీలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ గ్రాండ్ టూరర్ కారుగా ఇది సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. కార్ బయటి లుక్‌ను ఇంకా సీక్రెట్‌గా ఉంచినప్పటికీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఫస్ట్ టైమ్ దీని ఇంటీరియర్ లుక్‌ను రివీల్ చేసింది. సరికొత్త 'ఇఎమ్‌ఎ' (EMA) ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న మొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం.

లాంగ్ డ్రైవ్‌లకు ది బెస్ట్ ఆప్షన్

మామూలు ఎస్‌యూవీ కార్లలా కాకుండా, లాంగ్ డ్రైవ్‌లు చేసేవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా గ్రాండ్ టూరర్ మోడల్‌తో దీనిని డిజైన్ చేశారు. స్లీక్ డిజైన్, క్యూట్ రూఫ్‌లైన్‌తో కారు చూసేందుకు ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తోంది. బ్రిటన్‌లోని డిజైన్ సెంటర్ పరిసరాల ఆధారంగా వేసిన స్పెషల్ గోల్డ్ కామోఫ్లేజ్ డిజైన్‌తో ఈ కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితుల్లో తన చివరి విడత రోడ్ టెస్టింగ్‌ను పూర్తి చేసుకుంటోంది.

కంటికి కనిపించని హైటెక్ ఫీచర్లు.. సింపుల్ డ్యాష్‌బోర్డ్

కార్ లోపల అడుగుపెడితే చాలా ప్రశాంతమైన, సింపుల్ వాతావరణం కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఒక పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను మాత్రమే అందించారు. స్టీరింగ్ వెనుక డ్రైవర్ కోసం చిన్న డిజిటల్ డిస్‌ప్లే ఉంది. అనవసరమైన బటన్లు, లైట్లతో డ్రైవింగ్ చేసేటప్పుడు మైండ్ డైవర్ట్ కాకుండా ఉండేలా దీనిని ప్లాన్ చేశారు. ఏసి వెంట్లు బయటికి కనిపించకుండా డ్యాష్‌బోర్డ్‌లోనే రహస్యంగా అమర్చారు. అంతేకాకుండా, డ్యాష్‌బోర్డ్‌ను కవర్ చేసే క్లాత్ లోపలే స్పీకర్లను సైతం దాచేశారు. దీనివల్ల కార్ క్యాబిన్ చాలా సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంటుంది.

వెనుక సీటు ప్రయాణికులకు మహారాజ భోగం

ముందు సీట్లే కాదు, వెనుక సీట్లో కూర్చునే వారికి కూడా ఈ కారులో రాచరిక అనుభూతి కలుగుతుంది. తమ కేటగిరీలోనే అత్యంత ఎక్కువ లెగ్‌రూమ్ ఇందులో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని కంపెనీ చెబుతోంది. అనవసరమైన హంగులు లేకుండా అత్యంత ప్రీమియం మెటీరియల్స్‌తో ఈ కారును తీర్చిదిద్దారు.

కొత్త 'EMA' ప్లాట్‌ఫామ్.. లండన్‌లో ప్రొడక్షన్

రేంజ్ రోవర్ నుండి వస్తున్న మిగతా ఎలక్ట్రిక్ కార్లు పాత ప్లాట్‌ఫామ్‌పై వస్తుండగా, ఈ 'జిటి' కారు మాత్రం ఎలక్ట్రిక్ కార్ల కోసమే ప్రత్యేకం తయారుచేసిన 'EMA' ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న తొలి మోడల్. మొదట ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్‌గా రానుండగా, ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్‌ను కూడా తీసుకువచ్చే ప్లాన్‌లో కంపెనీ ఉంది. బ్రిటన్‌లోని హేల్‌వుడ్ ప్లాంట్‌లో ఈ కారును తయారు చేయనున్నారు. ఈ కారు బ్యాటరీ కెపాసిటీ ఎంత? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? మోటార్ పవర్ ఎంత? అనే వివరాలను రేంజ్ రోవర్ ఇంకా సీక్రెట్‌గా ఉంచింది. రాబోయే కొద్ది నెలల్లో ఈ వివరాలన్నింటినీ కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story