Royal Enfield : బుల్లెట్ ప్రియులకు పండగే.. సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. పాపులర్ బైక్ క్లాసిక్ 350 మోడల్‌ను సరికొత్త అప్‌డేట్స్‌తో కంపెనీ లాంచ్ చేసింది.
Royal Enfield Classic 350
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన మోస్ట్ పాపులర్ బైక్ క్లాసిక్ 350 మోడల్‌ను కొన్ని అదిరిపోయే అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బైక్ పాత వింటేజ్ లుక్‌ను అలాగే ఉంచుతూనే, నేటి జనరేషన్‌కు నచ్చేలా మోడర్న్ టెక్నాలజీని యాడ్ చేసింది. ఈ సరికొత్త మోడల్‌లో రైడర్ల సౌకర్యం కోసం రెండు సరికొత్త ఫీచర్లను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో పాటు మొబైల్స్ త్వరగా ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఫాస్ట్ యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్టును అమర్చింది. అయితే ఈ కొత్త ఫీచర్లు అన్నీ కేవలం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఎంతంటే?
ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ స్టార్టింగ్ ప్రైస్ రూ.1.87 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. బేస్ మోడల్ అయిన సింగిల్ ఛానల్ ఏబీఎస్ రెడ్డిచ్ రెడ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. కాకపోతే ఈ బేస్ మోడల్‌లో కొత్తగా వచ్చిన స్లిప్పర్ క్లచ్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉండవు. ఇకపోతే అన్ని కొత్త ఫీచర్లు ఉండే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ల ప్రారంభ ధర రూ.1.95 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ అయిన ఎమరాల్డ్ గ్రీన్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ.2.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
ట్రాఫిక్‌లో డ్రైవింగ్ ఇక చాలా ఈజీ
ఈ కొత్త మోడల్‌లో ఇచ్చిన అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ రోజువారీ బైక్ నడిపేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సిటీల్లో ఉండే భారీ ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ నొక్కాల్సి వచ్చినప్పుడు రైడర్ చేతులపై పెద్దగా ఒత్తిడి పడకుండా ఈ ఫీచర్ చూసుకుంటుంది. దీనివల్ల క్లచ్ చాలా స్మూత్‌గా మారుతుంది. అంతేకాకుండా బైక్‌ను హై స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా గేర్లు డౌన్ చేసినా వెనుక చక్రం స్కిడ్ అవ్వకుండా లేదా జెర్కులు ఇవ్వకుండా ఈ స్లిప్పర్ క్లచ్ కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల రైడింగ్ చాలా సేఫ్‌గా, కంఫర్టబుల్‌గా సాగుతుంది.
లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి సూపర్ ఫీచర్
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన పాత యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టును తీసేసి, దాని ప్లేస్‌లో లేటెస్ట్ యూఎస్‌బీ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టును పెట్టింది. బైక్‌పై లాంగ్ జర్నీలు చేసే వారికి, అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ లో లొకేషన్/నావిగేషన్ చూసుకునే వారికి ఈ ఫీచర్ ఒక వరమని చెప్పొచ్చు. రోజు ఆఫీసులకు వెళ్లేవారు కూడా జర్నీలోనే తమ స్మార్ట్‌ఫోన్లను చాలా స్పీడ్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ పూర్తిగా తప్పిపోతుంది.
లుక్ పాతదే.. ఫీచర్లు కొత్తవి
ఈ కొత్త ఫీచర్లు మినహాయిస్తే బైక్ మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. క్లాసిక్ 350 బైక్‌లో ఎప్పటిలాగే నమ్మకమైన 349 సీసీ జే-సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కంటిన్యూ చేశారు. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ 20.2 బీహెచ్‌పీ పవర్‌ను, 27 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. బైక్ సిగ్నేచర్ డిజైన్, కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్, 19-18 ఇంచుల స్పోక్ వీల్స్ సెటప్‌ను అలాగే ఉంచారు. బైక్ సస్పెన్షన్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. మొత్తానికి చూస్తే ఈ చిన్న అప్‌డేట్స్ బైక్ నడిపే బుల్లెట్ ప్రియులకు సరికొత్త రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని చెప్పొచ్చు.




