Simple Energy: ఫుల్ ఛార్జ్ తో 265 కిమీల జర్నీ.. దూకుడు పెంచిన సింపుల్ ఎనర్జీ.. ధరెంతంటే?
Simple Energy eastern India: ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తమ స్థానం బలపరుచుకుంటున్న సింపుల్ ఎనర్జీ, తూర్పు భారతంలో కీలక అడుగు వేసింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో తొలి ‘సింపుల్ స్టోర్’ ప్రారంభించి విక్రయాలు, సర్వీస్, స్పేర్స్‌ను ఒకేచోట అందుబాటులోకి తీసుకొచ్చింది. 265 కిలోమీటర్ల రేంజ్ కలిగిన మోడల్‌తో ఈ స్టోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Simple Energy: ఫుల్ ఛార్జ్ తో 265 కిమీల జర్నీ.. దూకుడు పెంచిన సింపుల్ ఎనర్జీ.. ధరెంతంటే?
Simple OneS Gen 2: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ సింపుల్ ఎనర్జీ, తూర్పు భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ 3S ఫెసిలిటీగా పనిచేస్తుంది. అంటే సేల్స్, సర్వీస్, స్పేర్స్ మూడు సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉంటాయి. సిలిగురి ఈశాన్య భారతానికి ప్రవేశ ద్వారంగా భావించబడటంతో, కంపెనీ విస్తరణ వ్యూహంలో ఈ నగరానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది.
ఒకే చోట టెస్ట్ రైడ్ నుంచి సర్వీస్ వరకూ..
సుమారు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త స్టోర్‌ను స్థానిక భాగస్వామి CTA Connectతో కలిసి అభివృద్ధి చేశారు. ఇక్కడ కస్టమర్లు స్కూటర్లను పరిశీలించడం, టెస్ట్ రైడ్ తీసుకోవడం, బుకింగ్ చేయడం మాత్రమే కాకుండా, తర్వాత సర్వీస్, స్పేర్ పార్ట్స్ సదుపాయాలను కూడా పొందవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌కు కూడా అవకాశముండటం కొనుగోలుదారులకు మరింత సౌలభ్యాన్ని ఇస్తోంది.
265 కిమీ రేంజ్ స్కూటర్ ప్రధాన ఆకర్షణ..
ఈ స్టోర్‌లో కంపెనీ తన తాజా మోడళ్లైన Simple One Gen 2 (5 kWh), Simple OneS Gen 2లను ప్రదర్శిస్తోంది. వీటిలో Simple One Gen 2 ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 265 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర సిలిగురిలో రూ.1,77,999గా ఉంది. మరోవైపు, పట్టణ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన Simple OneS Gen 2 ఒక్కసారి ఛార్జ్‌పై 191 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుందని, దీని ధర రూ.1,49,999 నుంచి ప్రారంభమవుతుందని నివేదికలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా విస్తరణకు ప్లాన్..
సిలిగురి స్టోర్ ప్రారంభంతో సింపుల్ ఎనర్జీ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. ప్రస్తుతం కంపెనీకి భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో కలిపి 63 ఔట్‌లెట్లు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. సిలిగురి తర్వాత నాగ్‌పూర్, రాంచి, భువనేశ్వర్ వంటి నగరాల్లో కూడా కొత్త స్టోర్లు ప్రారంభించే ప్రణాళికను కంపెనీ వెల్లడించింది. ప్రీమియం ఈ-స్కూటర్ విభాగంలో పోటీ పెరుగుతున్న సమయంలో, తూర్పు భారతంపై ఈ ఫోకస్ సింపుల్ ఎనర్జీకి వ్యూహాత్మకంగా కీలకమవుతోంది.




