Simple Wave: నెలకు రూ.1700లే ఈఎంఐ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 400కిమీ రేంజ్ ఇచ్చే స్కూటర్

Simple Wave: ఇప్పటివరకు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఐక్యూబ్, చేతక్ స్కూటర్లకు గట్టి సవాలు విసురుతూ బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ సంస్థ తన కొత్త ఈ-స్కూటర్‎ను సెప్టెంబర్ 2న విడుదల చేయడానికి సిద్ధమైంది.

CR Reddy
Published on: 21 Aug 2026 9:15 AM IST
Simple Wave
X

Simple Wave: దేశీయ టూవీలర్ మార్కెట్‌లో ప్రస్తుతం కుటుంబ అవసరాలకు పనికొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా వంటి మోడల్స్ మార్కెట్లో ఊహించని విజయాన్ని సాధించాయి. ఇదే బాటలో సామాన్య కుటుంబాలను ఆకట్టుకోవడానికి సింపుల్ ఎనర్జీ తన సరికొత్త మోడల్‌ను సిద్ధం చేసింది. గతంలో అరైవ్ పేరుతో పేటెంట్ పొందినప్పటికీ, దీనికి సింపుల్ వేవ్ అనే సరైన పేరును ఖరారు చేశారు. బెంగళూరు వేదికగా ఈ వాహనం సెప్టెంబర్ 2న మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టబోతోంది.

ఇప్పటికే రోడ్డు మీద జరిగిన టెస్టుల్లో ఈ స్కూటర్ డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. నిత్యం వాడేందుకు అనువుగా ఉండే ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, విశాలమైన పొడవైన సీటు, ప్రయాణాన్ని సుఖవంతం చేసే మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థను ఇచ్చారు. హ్యాండిల్‌బార్ భాగంలో కాకుండా ఎప్రాన్ స్థానంలో లైట్లను అమర్చడం విశేషం. నక్షత్ర ఆకారంలో ఉండే అలాయ్ వీల్స్, ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అమర్చారు. డ్యూయల్ షాక్ అబ్జార్బర్ల వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం ఎంతో హాయిగా సాగుతుంది.

రైడర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్లో 7 ఇంచుల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించనున్నారు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, వాతావరణ సమాచారం తెలుసుకునే సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా కొండ ప్రాంతాల్లో తేలికగా నడపడానికి హిల్ అసిస్ట్, వెనక్కి వెళ్లేందుకు రివర్స్ గేర్, క్రూయిజ్ కంట్రోల్, కీ-లెస్ స్టార్ట్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి. ఎల్ఈడీ వెలుగులతో రాత్రి వేళ ప్రయాణం ఎంతో సురక్షితంగా మారుతుంది.

కంపెనీ వద్ద ఉన్న సింపుల్ వన్-ఎస్ మోడల్ సాంకేతిక ఆధారంగానే ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో 3.7 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉండనుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 190 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని అంచనా. గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా మోటార్ పనిచేస్తుంది. సింపుల్ సంస్థ పోర్ట్‌ఫోలియోలోని అగ్రశ్రేణి మోడళ్లు దాదాపు 400 కిలోమీటర్ల వరకు పరిధిని ఇస్తుండటంతో, ఈ కొత్త వేవ్ మోడల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story