Skoda Slavia Facelift: గేర్‌బాక్స్ అప్‌గ్రేడ్.. ఫీచర్లు మాత్రం అదుర్స్..

Skoda Slavia Facelift: స్కోడా స్లావియా కొత్త లుక్‌లో మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఫేస్‌లిఫ్ట్ స్లావియా ఉత్పత్తిని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా పుణెలోని చకన్ ప్లాంట్‌లో..

G Krishna
Published on: 28 Sept 2026 6:38 PM IST
Skoda Slavia Facelift
X

Skoda Slavia Facelift: గేర్‌బాక్స్ అప్‌గ్రేడ్.. ఫీచర్లు మాత్రం అదుర్స్..

Skoda Slavia Facelift: స్కోడా స్లావియా కొత్త లుక్‌లో మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఫేస్‌లిఫ్ట్ స్లావియా ఉత్పత్తిని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా పుణెలోని చకన్ ప్లాంట్‌లో ఇప్పటికే మొదలుపెట్టింది. అక్టోబర్ 6న ఈ కొత్త మోడల్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. 2022లో ఇండియాలోకి వచ్చినప్పటి నుంచి స్లావియా 80 వేలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మిడ్‌సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో దాదాపు 30 శాతం మార్కెట్ షేర్‌తో స్లావియా తన స్థానాన్ని కొనసాగిస్తోంది.

లుక్‌లో కొత్త మార్పులు

కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో బయట లుక్‌కు కొన్ని కీలక మార్పులు చేశారు. కొత్త LED హెడ్‌ల్యాంప్స్, కొత్త డిజైన్ టెయిల్ ల్యాంప్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు ఇందులో ఉన్నాయి. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో పాటు ముందు భాగంలో ఇల్యూమినేటెడ్ గ్రిల్ కూడా ఇచ్చారు. దీంతో పాత మోడల్‌తో పోలిస్తే కొత్త స్లావియా మరింత ప్రీమియం లుక్‌లో కనిపించనుంది. ఇంటీరియర్‌లో కూడా కొత్త కలర్ థీమ్స్ అందించారు. ముఖ్యంగా Monte Carlo వేరియంట్‌లో డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్, బ్లాక్ ఎలిమెంట్స్, స్పెషల్ బ్యాడ్జింగ్ వంటి మార్పులు ఉన్నాయి. స్కోడా మోటార్‌స్పోర్ట్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన కొన్ని ఎలిమెంట్స్‌ను కూడా ఇందులో కొనసాగించారు.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో బిగ్ ఛేంజ్

ఫేస్‌లిఫ్ట్ స్లావియాలో మెకానికల్‌గా వచ్చిన ముఖ్యమైన మార్పు ఆటోమేటిక్ గేర్‌బాక్స్. 1.0 లీటర్ TSI ఇంజిన్‌తో ఉన్న పాత 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో ఇప్పుడు కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వచ్చింది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ మరింత స్మూత్‌గా ఉండేలా ఈ మార్పు ఉపయోగపడనుంది. అయితే 1.5 లీటర్ TSI ఇంజిన్‌లో మాత్రం మార్పు లేదు. ఈ ఇంజిన్‌తో 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ కొనసాగుతుంది. దీంతో పనితీరు కోరుకునే కస్టమర్లకు 1.5 TSI ఆప్షన్ అలాగే ఉంటుంది.

వెనుక సీటుకూ మసాజ్ ఫంక్షన్

ఫీచర్ల విషయంలో కూడా స్కోడా కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇచ్చింది. ముఖ్యంగా వెనుక సీట్లలో మసాజ్ ఫంక్షన్ ఇవ్వడం ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనితో పాటు పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి. ఇందులో AI అసిస్టెంట్‌ను కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రియర్ డీఫాగర్, ఆటో డిమ్మింగ్ IRVM వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అంటే రోజువారీ డ్రైవింగ్‌లో ఉపయోగపడే చిన్న చిన్న ఫీచర్లపైనా కంపెనీ ఫోకస్ పెట్టింది.

సేఫ్టీకి కూడా ప్రాధాన్యం

సేఫ్టీ విషయంలో స్లావియాకు ఇప్పటికే మంచి రికార్డ్ ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ కూడా 5 స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా వస్తాయి. అలాగే 25కి పైగా యాక్టివ్, ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రియర్ డీఫాగర్, ఆటో డిమ్మింగ్ మిర్రర్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సులభంగా, సేఫ్‌గా చేయడంలో ఉపయోగపడతాయి.

విదేశాలకు కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’

స్లావియా ఇండియాలో అమ్ముడవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. వియత్నాం, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్లకు భారత్ నుంచి స్లావియా కార్లు వెళ్తున్నాయి. కైలాక్, కుషాక్‌తో కలిసి స్కోడా ఇండియా పోర్ట్‌ఫోలియోలో స్లావియా కీలక మోడల్‌గా ఉంది. స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇప్పటివరకు ఇండియాలో 20 లక్షలకు పైగా వాహనాలను తయారు చేసింది. 40కి పైగా దేశాలకు 7.25 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసింది. ఇక స్లావియా ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 6న మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీని ధర, వేరియంట్లు, కొత్త ఫీచర్లపై మరింత క్లారిటీ రానుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.