Tata Aeris: టాటా నుంచి సరికొత్త ఏరిస్ సెడాన్ కారు.. రేపే మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ
Tata Aeris: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టాటా మోటార్స్ తన లైనప్‌లోకి మరో అద్భుతమైన కొత్త కారును తీసుకురావడానికి సిద్ధమైంది.
Tata Aeris
Tata Aeris: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టాటా మోటార్స్ తన లైనప్‌లోకి మరో అద్భుతమైన కొత్త కారును తీసుకురావడానికి సిద్ధమైంది. రేపు సెప్టెంబర్ 25న కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏరిస్ సెడాన్ కారును అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. లాంచ్ తేదీ దగ్గర పడుతుండటంతో కంపెనీ దీనికి సంబంధించిన ఇంటీరియర్ వీడియో టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా కారులో అందించబోయే అధునాతన ఫీచర్లను హైలైట్ చేయడంతో ఆటోమొబైల్ ప్రియుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్
టాటా ఏరిస్ డాష్‌బోర్డ్ లేఅవుట్ చూసేందుకు కొత్త తరం టియాగోను పోలి ఉన్నప్పటికీ, పూర్తి కేబిన్‌లో ప్రత్యేకమైన బెజ్ కలర్ థీమ్‌ను ఉపయోగించడం వల్ల ఇది చాలా రిచ్ లుక్‌ను ఇస్తుంది. డాష్‌బోర్డ్ మధ్యలో ఆకర్షణీయమైన ఫ్రీ-స్టాండింగ్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వనున్నారు. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, హర్మన్ సౌండ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే టూ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి ఆధునిక హంగులు ఇందులో ఉండనున్నాయి.
ఇంటిగ్రేటెడ్ డాష్కామ్ స్పెషాలిటీ
ఈ సరికొత్త ఎరిస్ సెడాన్ ప్రధాన ఆకర్షణగా 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ నిలవనుంది. విడుదలైన టీజర్లో ఫ్రంట్, రేర్, లెఫ్ట్, రైట్ కెమెరా వ్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కెమెరా సిస్టమ్‌లోనే బిల్ట్-ఇన్ డాష్కామ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల అదనంగా ఎలాంటి బయటి డివైజ్‌లు పెట్టాల్సిన అవసరం లేకుండానే ప్రయాణ సమయంలో చుట్టూ జరిగే విషయాలను రికార్డ్ చేసుకోవడానికి, ఇరుకైన ప్రదేశాలలో కారును పార్కింగ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇంజన్ ఆప్షన్లు, డ్యూయల్ సీఎన్జీ సిలిండర్ టెక్నాలజీ
పర్ఫామెన్స్ పరంగా చూస్తే ఈ కారులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ఇది మ్యాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానుంది. ముఖ్యంగా టాటా కార్లలో విరివిగా వాడే డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీని ఈ సెడాన్‌లో కూడా అందించనున్నారు. దీనివల్ల బూట్ స్పేస్ కోల్పోకుండానే ఎక్కువ లగేజ్ సర్దుకోవచ్చు. మార్కెట్లో విడుదలైన తర్వాత ఈ కారు ప్రధానంగా మార్కెట్లోని మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, సొంత బ్రాండ్‌లోని టిగోర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.




