Tata Motors: 502 కి.మీ రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న కారుపై రూ.3.35 లక్షల తగ్గింపు

Tata Motors: పండుగల సీజన్ సందర్భంగా వాహన కొనుగోలుదారులకు టాటా మోటార్స్ ఊహించని బంపర్ ఆఫర్ ప్రకటించింది.

CR Reddy
Published on: 4 Sept 2026 9:46 AM IST
tata curvv ev
X

tata curvv ev

Tata Motors: వినాయక చవితి పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా మొదలవుతుండటంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్లను రంగంలోకి దించింది. ఈ నెలలో అత్యధిక తగ్గింపు లభిస్తున్న మోడల్‌గా టాటా కర్వ్ నిలిచింది. కర్వ్ ఈవీ ఎక్స్ సిరీస్‌పై కంపెనీ నేరుగా రూ.3 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ అందిస్తోంది. బేస్ మోడల్ క్రియేటివ్ వేరియంట్‌పై కూడా రూ.2.50 లక్షల క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కలిగిన మోడళ్లపై అన్ని వేరియంట్లకు రూ.1.25 లక్షల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. పండుగ పూట కొత్త కారు ఇంటికి తీసుకెళ్లాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

అద్భుతమైన రేంజ్.. పవర్‌ఫుల్ బ్యాటరీ

ఆకట్టుకునే కూపే స్టైలింగ్‌తో రూపుదిద్దుకున్న ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 45 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌తో 430 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, 55 కిలోవాట్స్ పెద్ద బ్యాటరీ ప్యాక్ ఏకంగా 502 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. క్లోజ్డ్ గ్రాండ్ గ్రిల్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఈ కారుకి రాయల్ లుక్ తెచ్చిపెట్టాయి. ప్రిస్టిన్ వైట్, ఫ్లేమ్ రెడ్, ప్యూర్ గ్రే వంటి ఐదు విభిన్న రంగుల్లో ఈ మోడల్ లభిస్తోంది. ప్యాసింజర్ల లగేజీ కోసం 500 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ కేటాయించారు.

హైటెక్ ఇంటీరియర్.. ప్రీమియం ఫీచర్లు

కారు ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది కస్టమర్లను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. వాయిస్ కంట్రోల్ సపోర్ట్ చేసే పనోరమిక్ సన్ రూఫ్, మూడ్ లైటింగ్, స్మార్ట్ 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ప్రయాణ అనుభూతిని మరింత ప్రత్యేకం చేస్తాయి. హార్మన్ కంపెనీకి చెందిన 12.3 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వాహనంలో అమర్చారు. వెంటిలేటెడ్ సీట్లు, అడ్వాన్స్డ్ వెహికల్ అలర్ట్ సిస్టమ్, వేరే వాహనాలను ఛార్జ్ చేసుకునే వి2వి, వి2ఎల్ సాంకేతికతలు ఈ కారులోని ప్రధాన ఆకర్షణలు.

బెస్ట్ సేఫ్టీ.. అడాస్ టెక్నాలజీ

ప్రయాణికుల రక్షణకు టాటా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఈ కారులో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. తన విభాగంలోనే అత్యంత ఎక్కువ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) ఫీచర్లు ఉన్న కారుగా ఇది నిలిచింది. లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అత్యుత్తమ సేఫ్టీ ఆప్షన్లు ఇందులో అమర్చారు. గంటకు 20 కిలోమీటర్ల వేగం వరకు నడిచేటప్పుడు బాటసారులను హెచ్చరించడానికి ప్రత్యేక సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story