Tata Motors : టాటా మోటార్స్ సంచలనం.. ఈ వేసవిలో కారు కొంటే రూ.55,000 మీ జేబులో ఉన్నట్టే
Tata Motors : టాటా మోటార్స్ జూన్ 2026లో తన పాపులర్ కార్లపై రూ. 55,000 వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
Tata Motors
Tata Motors : మండుతున్న ఎండల్లో బైక్‌పై ప్రయాణించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఈ వేసవిలో ఒక సొంత కారు కొనుక్కోవాలని కలలు కంటుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూన్ 2026 నెలలో తమ పాపులర్ కార్లపై భారీ స్థాయిలో డిస్కౌంట్లు, బెనిఫిట్స్‌ను ప్రకటించింది. టియాగో నుంచి లేటెస్ట్ కర్వ్ వరకు దాదాపు అన్ని మోడల్స్‌పై రూ.30,000 నుంచి రూ.55,000 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్?
టాటా మోటార్స్ తన ఐసీఈ (ICE - పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) లైనప్‌పై ఈ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో ప్రధానంగా టాటా కర్వ్ పై అత్యధికంగా రూ.55,000 వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇందులో రూ.30,000 కన్జ్యూమర్ డిస్కౌంట్ ఉండగా, మరో రూ.25,000 స్క్రాపేజ్ బోనస్ రూపంలో పొందవచ్చు. ఇక యువతను ఎక్కువగా ఆకట్టుకునే నెక్సాన్ మోడల్‌పై రూ.30,000 వరకు తగ్గింపు ఉంది. అయితే, నెక్సాన్ డీజిల్ వేరియంట్ కొనేవారికి కేవలం రూ.20,000 వరకు మాత్రమే బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
హ్యాచ్‌బ్యాక్ కార్లపై కూడా పండగే
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో దూసుకుపోతున్న టాటా ఆల్ట్రోజ్ పై ప్రస్తుతం రూ.35,000 వరకు లాభం చేకూరుతోంది. ఇందులో రూ.15,000 నేరుగా నగదు తగ్గింపు కాగా, రూ.20,000 వరకు స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. బడ్జెట్ ధరలో కారు కావాలనుకునే వారి ఫేవరెట్ టియాగో పై కూడా కంపెనీ రూ.30,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ తగ్గింపులు నగదు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో వినియోగదారులకు అందుతాయి.
డిలర్ల వద్దే అసలు లెక్కలు
ఈ ఆఫర్లు కేవలం 2026లో తయారైన మోడల్స్‌కు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి. అయితే, ఈ డిస్కౌంట్ రేట్లు మీరు ఉండే నగరం, ఎంచుకునే వేరియంట్, డిలర్‌షిప్‌ను బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు స్థానిక టాటా మోటార్స్ షోరూమ్‌కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. సొంత కారు కల నెరవేర్చుకోవడానికి, అదే సమయంలో వేల రూపాయలు ఆదా చేసుకోవడానికి ఈ జూన్ నెల సరైన సమయమని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు.




