Tata Nexon : కొత్త రంగులు, సరికొత్త డిజైన్.. కేవలం రూ.9.99 లక్షలకే టాటా నయా కార్ లాంచ్

Tata Nexon : టాటా మోటార్స్ కొత్త నెక్షన్ క్యామో ఎడిషన్‌ను రూ.9.99 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కొత్త రంగులు, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్ ఆకర్షణగా నిలవనున్నాయి.

CR Reddy
Published on: 7 Aug 2026 9:29 AM IST
Tata Nexon
X

Tata Nexon 

Tata Nexon : భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్లో సరికొత్త నెక్సాన్ క్యామో ఎడిషన్‎ను అధికారికంగా విడుదల చేసింది. పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.9.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కస్టమర్ల కోసం క్రియేటివ్, క్రియేటివ్+ S, క్రియేటివ్+ PS, ఫియర్‌లెస్+ PS, ఫియర్‌లెస్+ A PS వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. ఎక్స్‌క్లూజివ్ స్టైలింగ్, మోడ్రన్ టెక్నాలజీ మార్పులతో వచ్చిన ఈ కారు విపరీతమైన ఆదరణ పొందుతోంది.

డిజైన్, లుక్స్ పరంగా నెక్సాన్ క్యామో ఎడిషన్ రెండు సరికొత్త ఎక్స్‌క్లూజివ్ రంగుల్లో లభిస్తుంది. వీటిలో మున్నార్ మిస్ట్, కూల్ క్లౌడ్ రంగులు ఉన్నాయి. కార్ ఫ్రంట్ ఫెండర్లపై ప్రత్యేకమైన Camo బ్యాడ్జింగ్‌ను అందించడం ద్వారా సాధారణ నెక్సాన్ కంటే దీనికి ప్రీమియం, ఆర్మీ లుక్‌ను తెచ్చిపెట్టారు. క్యాబిన్ ఇంటీరియర్‌లో కూడా క్యామో థీమ్‌ను కొనసాగిస్తూ, ముందు సీట్ల హెడ్‌రెస్ట్‌లపై ప్రత్యేకమైన Camo పర్‌ఫొరేషన్ తో డిజైన్ చేశారు.

క్యాబిన్ లోపల లభించే అతిపెద్ద మార్పు దీని 12.3-అంగుళాల హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. స్టాండర్డ్ నెక్సాన్తో పోలిస్తే ఈ స్క్రీన్ పరిమాణంలో చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే డ్రైవర్ కోసం 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ యథావిధిగా లభిస్తుంది. భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఇందులో ఒక ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్‌ను కూడా జతచేసింది. ఇది కారులోని 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌తో కలిసి పనిచేస్తుంది, దీనివల్ల వాహనదారులు విడిగా బయట డాష్‌క్యామ్ అమర్చుకోవాల్సిన అవసరం ఉండదు.

ఈ కార్ వేరియంట్‌ను బట్టి పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభిస్తాయి. భద్రత కోసం 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటరింగ్, ADAS టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇంజిన్ ఆప్షన్ల విషయానికొస్తే.. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ సీఎన్‌జీ ఆప్షన్లను యథాతథంగా కొనసాగించారు. ప్రసార వ్యవస్థ కోసం 6-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ, 7-స్పీడ్ డిసిఏ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఎడిషన్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story