Tata Sierra EV : సింగిల్ ఛార్జ్‌తో 665 కిమీల రేంజ్.. టాటా సియెర్రా EV వచ్చేసింది..!

Tata Sierra EV : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. కార్ల ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐకానిక్ మోడల్ ‘టాటా

G Krishna
Published on: 1 July 2026 12:18 PM IST
Tata-Sierra-EV
X

Tata-Sierra-EV

Tata Sierra EV : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. కార్ల ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐకానిక్ మోడల్ ‘టాటా సియెర్రా’ను ఎలక్ట్రిక్ అవతారంలో (Tata Sierra EV) భారత్‌లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 18.79 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. సరికొత్త ‘Acti.ev+’ ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన ఈ లగ్జరీ ఈవీ, మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ధరలు , వేరియంట్లు

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ SUV మొత్తం నాలుగు ప్రధాన వేరియంట్లలో (ప్యూర్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ AWD) లభిస్తుంది. బ్యాటరీ సైజు, ఫీచర్లను బట్టి వీటి ధరలు రూ. 18.79 లక్షల నుండి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ రూ. 24.79 లక్షల వరకు ఉన్నాయి. అయితే ఈ ధరలలో హోమ్ చార్జర్, దాని ఇన్‌స్టాలేషన్ ఖర్చులు ఉండవని టాటా స్పష్టం చేసింది.

ఒక్క చార్జ్‌తో 665 కిలోమీటర్ల మైలేజ్

సియెర్రా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో (63kWh , 75kWh) వస్తుంది. దీని రేంజ్ విషయానికి వస్తే, 63kWh బ్యాటరీ వెర్షన్ 566 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. పెద్దదైన 75kWh బ్యాటరీ వెర్షన్ ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 665 కిలోమీటర్ల (MIDC క్లెయిమ్డ్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. నిజ జీవితంలో (Real World) కూడా ఇది సులభంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని టాటా ధీమా వ్యక్తం చేసింది. 120kW డీసీ ఫాస్ట్ చార్జింగ్ సాయంతో కేవలం 15 నిమిషాల చార్జింగ్‌తో 263 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఆఫ్‌రోడింగ్ కోసం ఆల్‌-వీల్ డ్రైవ్ (AWD)

టాప్ వేరియంట్ అయిన 'ఎంపవర్డ్ A' లో టాటా మోటార్స్ పవర్‌ఫుల్ డ్యూయల్-మోటార్ ఆల్‌-వీల్ డ్రైవ్ (AWD) సెటప్‌ను అందించింది. ఇది కేవలం 5.8 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో నార్మల్, మడ్, శాండ్, రాక్ క్రాల్ వంటి ఆరు రకాల ఆఫ్‌రోడ్ టెర్రైన్ మోడ్స్ ఉన్నాయి. దీనివల్ల ఎలాంటి కఠినమైన దారుల్లోనైనా ఈ కారు సులభంగా దూసుకుపోతుంది.

కారు లోపల మూడు స్క్రీన్లు.. గేమింగ్ ఫీచర్!

కారు లోపలి భాగాన్ని అత్యంత విలాసవంతంగా, హైటెక్ ఫీచర్లతో డిజైన్ చేశారు. ఇందులో దేశంలోనే మొదటిసారిగా ‘హోరిజోన్ వ్యూ’ పేరుతో మూడు 12.3 ఇంచుల డిస్‌ప్లేలను డాష్‌బోర్డ్‌పై అమర్చారు. డ్రైవర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్లతో పాటు ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన స్క్రీన్‌లో ఎయిర్ కన్సోల్ (AirConsole) ద్వారా గేమింగ్ ఆడుకునే సదుపాయం ఉంది. దీంతో పాటు జేబీఎల్ 12-స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, కాలుష్యాన్ని నియంత్రించే బ్రీత్-ఐక్యూ ఎయిర్ ప్యూరిఫైయర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే , గెస్చర్ కంట్రోల్ టెయిల్‌గేట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీలో నెక్స్ట్ లెవెల్

భద్రత పరంగా టాటా కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సియెర్రా ఈవీలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, 22 ఫంక్షన్లు కలిగిన లెవెల్ 2+ ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీని అందించారు. కారు కింద భాగం కూడా స్పష్టంగా కనిపించేలా 540-డిగ్రీల హెచ్‌డీ కెమెరా సిస్టమ్‌ను ఇందులో చేర్చారు. అన్నిటికంటే ముఖ్యంగా, మొదటి ప్రైవేట్ యజమానికి ఈ కారు హై-వోల్టేజ్ బ్యాటరీపై ఏకంగా 15 ఏళ్ల లైఫ్‌టైమ్ వారంటీని టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story