Tesla: రోడ్లపై తిరిగే దెయ్యాల కార్లు.. టెస్లా నుంచి అదిరిపోయే హలోవీన్ మోడ్ అప్‌డేట్

Tesla: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది

CR Reddy
Published on: 1 Nov 2026 8:36 AM IST
Tesla
X

Tesla 

Tesla: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. హలోవీన్ పండుగను పురస్కరించుకుని మోడల్ వై, మోడల్ ఎల్ కార్ల కోసం ప్రత్యేకంగా హలోవీన్ మోడ్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 30, 2026 నుంచి ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రూపంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల కారు యజమానులు సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే తమ కార్లలో దెయ్యం లాంటి భయానక వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు.

విభిన్న హలోవీన్ ఫీచర్లు.. భయపెట్టే లైటింగ్ ఎఫెక్ట్స్

ఈ కొత్త అప్‌డేట్‌లో భాగంగా టెస్లా యాప్‌లో కార్ల రూపం దెయ్యంలా కనిపించేలా ఘోస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌ను పొందుపరిచారు. తెల్లటి చున్నీ కప్పుకున్న దెయ్యం ఆకారంలో యాప్ స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా ఇచ్చిన ట్రిక్ ఆర్ ట్రీట్ మోడ్ ఆన్ చేస్తే, కారు దగ్గరకు ఎవరైనా వస్తే చాలు భయానక శబ్దాలు వస్తాయి. కారు లైట్లు అటూఇటూ ట్రిమ్ అవుతూ వింతైన కాంతిని ప్రసరిస్తాయి. నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోని టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో కూడా ఈ అద్భుతమైన ఫీచర్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించారు.

లైట్ షో.. డెవిల్ లాంటి లాక్ సౌండ్స్

ఈ ప్రత్యేక అప్‌డేట్‌లో హలోవీన్ థీమ్‌తో కూడిన సరికొత్త లైట్ షోను కూడా జోడించారు. కారును లాక్ చేసినప్పుడు సాధారణ సౌండ్‌కు బదులుగా భయానకమైన శబ్దాలు వినిపిస్తాయి. దీనికి తోడుగా కారు లోపల కూర్చుని ప్రత్యేకమైన హలోవీన్ సెల్ఫీలు తీసుకునేందుకు ఫోటోబూత్ ఆప్షన్ కూడా ఇచ్చారు. 'వాయిస్ ఫ్రమ్ బియాండ్' అనే మరో ఫీచర్ ద్వారా టెస్లా యాప్ నుంచి పంపే వాయిస్ మెసేజ్‌లను కారు డెవిల్ గొంతులో మార్చి బయటకు వినిపించేలా చేయడం విశేషం.

ఏ ఇబ్బంది లేకుండా నేరుగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

టెస్లా తీసుకొచ్చిన ఈ వినూత్న అప్‌డేట్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ కార్లను కేవలం ప్రయాణ సాధనంగా కాకుండా సరదాగా గడిపే హ్యాపీ జోన్‌గా మార్చవచ్చు అని టెస్లా మరోసారి నిరూపించింది. ఎలక్ట్రిక్ కార్ లవర్లను, ముఖ్యంగా టెక్ గీక్స్‌ను ఈ ఫీచర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పండుగ సీజన్‌లో రోడ్లపై ఈ విభిన్న హలోవీన్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.