Scooter Sales : రోడ్లపై ఎటు చూసినా ఈ స్కూటరే.. కాంపిటీటర్ల మైండ్ బ్లాక్ చేస్తున్న హోండా

Scooter Sales : భారత టూ-వీలర్ మార్కెట్లో హోండా యాక్టివా మరోసారి సేల్స్‌లో దుమ్మురేపింది.

CR Reddy
Published on: 20 July 2026 9:07 AM IST
Scooter Sales
X

Scooter Sales 

Scooter Sales : భారత టూ-వీలర్ మార్కెట్లో ప్రస్తుతం స్కూటర్లకు ఉన్న క్రేజ్ నానాటికీ విపరీతంగా పెరుగుతోంది. గడిచిన జూన్ 2026 నెలకు సంబంధించిన సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రసిద్ధ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండాకు చెందిన యాక్టివా మరోసారి సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జూన్ నెలలో ఏకంగా 2,18,932 మంది కొత్త కస్టమర్లు యాక్టివాను కొనుగోలు చేశారు. గతేడాది జూన్ నెలలో నమోదైన 1,83,265 యూనిట్లతో పోలిస్తే ఈసారి ఏకంగా 19 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.

టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ హవా

అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ల జాబితాలో టీవీఎస్ కంపెనీకి చెందిన జూపిటర్ రెండో స్థానంలో నిలిచింది. జూపిటర్ గత నెలలో 27 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 1,36,805 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక మూడో స్థానంలో సుజుకి యాక్సెస్ నిలిచింది. ఫ్యామిలీ రైడర్ల అభిమానాన్ని పొందిన ఈ స్కూటర్ 22 శాతం వృద్ధితో 63,121 యూనిట్ల సేల్స్‌ను సాధించి తన బలాన్ని నిరూపించుకుంది.

టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ విక్రయాల్లో ఊహించని గ్రోత్

మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కూడా అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. టాప్-10 స్కూటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 232 శాతం వార్షిక వృద్ధితో 47,331 యూనిట్ల భారీ విక్రయాలను నమోదు చేసింది. ఇక ఐదో స్థానంలో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 126 శాతం పెరుగుదలతో 40,376 యూనిట్లు అమ్ముడై ఈవి రంగానికి భారతీయులు ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టం చేసింది.

యూత్‌ను ఆకట్టుకుంటున్న టీవీఎస్ ఎన్‌టార్జ్, ఏథర్ రిజ్టా

స్పోర్టీ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటున్న స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఎన్‌టార్జ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఇది 65 శాతం వృద్ధితో 37,762 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఆ తర్వాతి ఏడో స్థానంలో ఏథర్ రిజ్టా నిలిచింది. రిజ్టా స్కూటర్ 97 శాతం వార్షిక ఎదుగుదలతో 24,742 యూనిట్ల సేల్స్ నమోదు చేసి మార్కెట్లో తన పట్టును బలపరుచుకుంది.

యమహా రే, సుజుకి బర్గ్‌మన్, హీరో డెస్టినీ జోరు

జాబితాలోని చివరి మూడు స్థానాల విషయానికొస్తే.. ఎనిమిదో స్థానంలో యమహా రే 60 శాతం వృద్ధితో 22,782 యూనిట్లు, తొమ్మిదో స్థానంలో సుజుకి బర్గ్‌మన్ 43 శాతం పెరుగుదలతో 22,454 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక పదో స్థానంలో నిలిచిన హీరో డెస్టినీ 125 స్కూటర్ 9 శాతం వృద్ధితో 22,010 యూనిట్ల సేల్స్ సాధించి టాప్-10 చార్ట్‌లో నిలిచింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే భారత్‌లో పెట్రోల్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా డిమాండ్ పీక్స్‌లో ఉందని స్పష్టమవుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story