Sunroof Cars: పండగ వేళ కొత్త కారు కొంటున్నారా? తక్కువ బడ్జెట్లో సన్‌రూఫ్ వచ్చే కార్లు ఇవే
కార్వా చౌత్ వేళ కారు సన్‌రూఫ్ నుంచి చందమామను చూడాలనుకుంటున్నారా? అత్యంత తక్కువ ధరలో సన్‌రూఫ్ ఫీచర్‌తో వస్తున్న టాప్ 5 కార్ల వివరాలు ఇవే.
Sunroof Cars
Sunroof Cars: కార్వా చౌత్ పండుగ వేళ చందమామను చూడటంలో ఉండే ఆనందే వేరు. పండుగ రోజున నింగిలోని చందమామ దర్శనం కోసం మహిళలు ఎంతగానో నిరీక్షిస్తుంటారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ప్రత్యేకమైన అనుభూతిని పొందడానికి కారు సన్‌రూఫ్ నుంచి చందమామను తిలకించడం కొత్త ట్రెండ్‌గా మారింది. బడ్జెట్ ధరలోనే సన్‌రూఫ్ ఫీచర్‌ను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న టాప్ 5 కార్ల వివరాలు చూద్దాం.
1. టాటా పంచ్
దేశంలోనే నంబర్-1 ఎస్‌యూవీగా పేరుగాంచిన టాటా పంచ్‌లో ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ నుంచే సింగిల్ పాన్ సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది పెట్రోల్ మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, సీఎన్జీ మోడ్‌లో 73 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుండగా, పెట్రోల్ మోడల్లో 5-స్పీడ్ ఏఎమ్‌టీ ఆప్షన్ కూడా ఇచ్చారు. ప్రారంభ ధర కేవలం రూ.5.74 లక్షలుగా ఉంది.
2. హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ కంపెనీకి చెందిన మైక్రో ఎస్యూవీ ఎక్స్టర్లో కూడా సన్‌రూఫ్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎక్స్టర్ హెచ్ఎక్స్4 ప్లస్ వేరియంట్ నుంచి సింగిల్ పాన్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఇందులో ఉన్న 1.2-లీటర్ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 83 హెచ్‌పి, సీఎన్జీ మోడ్‌లో 69 హెచ్‌పి పవర్ ఇస్తుంది. రెండు మోడళ్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డుగా రాగా, పెట్రోల్ వేరియంట్లో 5-స్పీడ్ ఏఎమ్‌టీ సదుపాయం కలదు.
3. కియా సోనెట్
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో మంచి క్రేజ్ ఉన్న కియా సోనెట్‌లో హెచ్‌టీఈ ఓ వేరియంట్ నుంచి సన్‌రూఫ్ ఫీచర్‌ను చేర్చారు. ఇందులో 120 హెచ్‌పి పవర్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. అలాగే 1.2-లీటర్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 116 హెచ్‌పి పవర్ కలిగిన 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కూడా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఈ కారును సొంతం చేసుకోవచ్చు.
4. హ్యుందాయ్ ఐ20
హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో సన్‌రూఫ్ ఉన్న అత్యంత చవకైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఐ20 మాగ్నా వేరియంట్ నుంచే సింగిల్ పాన్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఈ కారులో 83 హెచ్‌పి పవర్‌ని ఇచ్చే 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను అమర్చారు. మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లలో లభించే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు లగ్జరీ ఫీచర్లను అందిస్తుంది.
5. టాటా ఆల్ట్రోజ్
టాటా ఆల్ట్రోజ్ కార్లలో ప్యూర్ ఎస్ వేరియంట్ నుంచి సన్‌రూఫ్ ఆప్షన్ ప్రారంభమవుతుంది. పెట్రోల్, సీఎన్జీ రెండు ఆప్షన్లలోనూ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్లో 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ కలదు. ఇది 88 హెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ లేదా 6-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌లతో వస్తుంది. 74 హెచ్‌పి పవర్ ఇచ్చే ఆల్ట్రోజ్ సీఎన్జీ ప్యూర్ ఎస్ వేరియంట్లో మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది.




