Cheapest Electric Scooters: ఫుల్ ఛార్జ్ తో 142 కిమీల మైలేజీ.. దేశంలోనే అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీకోసం..!
Cheapest Electric Scooters: బ్యాటరీ సబ్స్క్రిప్షన్ విధానం ద్వారా దిగ్గజ సంస్థలు తమ వాహనాల ధరలను భారీగా తగ్గించాయి. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Cheapest Electric Scooters
Cheapest Electric Scooters: పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ, భారత మార్కెట్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. బ్యాటరీ సబ్స్క్రిప్షన్ విధానం (BaaS) ద్వారా విడా, టీవీఎస్, ఏథర్ వంటి దిగ్గజ సంస్థలు తమ వాహనాల ధరలను భారీగా తగ్గించాయి. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాటరీ సబ్స్క్రిప్షన్ విధానం అంటే ఏమిటి?
సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో బ్యాటరీ ఖర్చే 40 నుంచి 50 శాతం ఉంటుంది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) విధానంలో, వినియోగదారులు స్కూటర్ కొనేటప్పుడు బ్యాటరీ పూర్తి ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వాహనం ధరకు డబ్బులు చెల్లించి, బ్యాటరీకి మాత్రం నెలకు కొంత అద్దె లేదా కిలోమీటర్ల ప్రాతిపదికన చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రారంభ ధరలు గణనీయంగా తగ్గాయి.
విడా విఎక్స్2, టీవీఎస్ ఆర్బిటర్..
హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థ విడా తన 'విఎక్స్2' మోడల్‌ను అత్యంత చౌకగా అందిస్తోంది. ఈ విధానం కింద దీని ధర కేవలం రూ. 44,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 142 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది. అలాగే టీవీఎస్ సంస్థ నుంచి వచ్చిన 'ఆర్బిటర్ వి1' స్కూటర్ కూడా యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని ధర రూ. 49,999 గా నిర్ణయించారు. తక్కువ బరువు, స్మార్ట్ ఫీచర్లతో సిటీ ప్రయాణాలకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా..
మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఇష్టమైన టీవీఎస్ ఐక్యూబ్ ఇప్పుడు రూ. 59,999 కే అందుబాటులోకి వచ్చింది. దీనికి నెలకు నిర్ణీత అద్దె చెల్లించడం ద్వారా అపరిమిత కిలోమీటర్లు తిరిగే వెసులుబాటు కలదు. మరోవైపు ఏథర్ ఎనర్జీ నుంచి వచ్చిన 'రిజ్టా' ఫ్యామిలీ స్కూటర్ రూ. 76,000 ధరలో లభిస్తోంది. పెద్ద సీటు, అత్యధిక స్టోరేజ్, గూగుల్ మ్యాప్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
బజాజ్ చేతక్ - క్లాసిక్ లుక్ తో..
ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ తన ఐకానిక్ 'చేతక్' ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ఈ పథకం కిందకు తీసుకువచ్చింది. మెటల్ బాడీతో ధృడంగా ఉండే ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 91,000 కు తగ్గింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇవ్వడం దీని ప్రత్యేకత. పాతకాలపు క్లాసిక్ లుక్ తో పాటు ఆధునిక సాంకేతికతను కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఈ ఐదు స్కూటర్లు ఇప్పుడు సామాన్యుల ఎలక్ట్రిక్ వాహన కలను సాకారం చేస్తున్నాయి.




