CNG Cars: మధ్యతరగతి కుటుంబాలకు గుడ్‌న్యూస్.. 35 కిమీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే
CNG Cars: భారతీయ మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు రోజురోజుకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది.
Maruti Celerio CNG
CNG Cars: భారతీయ మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు రోజురోజుకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్కెట్‌లో మారుతి సుజుకీ సంస్థ తన తక్కువ ధరలు, అద్భుతమైన మైలేజ్‌తో ఎప్పుడూ ముందే ఉంటుంది. బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ మైలేజ్ ఇచ్చే 5 సీఎన్‌జీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మారుతి సుజుకీ సెలెరియో
ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచే సెలెరియో కిలో సీఎన్‌జీకి ఏకంగా 35.60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5,97,900గా ఉంది. ఇందులో 1.0-లీటర్ కె10సి డ్యుయెల్ జెట్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 66 హెచ్‌పీ పవర్‌ను, 89 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంజిన్ స్టార్ట్-స్టోప్ సిస్టమ్, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
2. మారుతి సుజుకీ వాగన్ఆర్
ఫ్యామిలీ కార్లలో ఎంతో పాపులర్ అయిన వాగన్ఆర్ సీఎన్‌జీ మోడల్ కిలోకు 34.05 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5,93,900గా ఉంది. 1.0 లీటర్ ఇంజిన్‌తో లభించే ఈ కారులో విశాలమైన క్యాబిన్ లభిస్తుంది. భద్రత కోసం స్టాండర్డ్‌గా అనేక ఫీచర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి రక్షణ వ్యవస్థలు కల్పించారు. కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఇది అత్యంత అనుకూలమైన కారు.
3. మారుతి సుజుకీ డిజైర్
కాంపాక్ట్ సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న డిజైర్ సీఎన్‌జీ వెర్షన్ కిలోకు 33.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 8,18,100గా ఉంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 70 హెచ్‌పీ పవర్ ఇస్తుంది. దీనిలో 55 లీటర్ల కెపాసిటీ గల పెద్ద సీఎన్‌జీ ట్యాంక్ లభిస్తుంది. VXi , ZXi వేరియంట్లలో ఈ కారు కొనుగోలుకు అందుబాటులో ఉంది.
4. మారుతి సుజుకీ స్విఫ్ట్
స్పోర్టీ లుక్ కోరుకునే యూత్ ఎంతో ఇష్టపడే స్విఫ్ట్ కారు సీఎన్‌జీ వేర్యంట్ కిలోకు 32.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7,57,400గా ఉంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 82 పీఎస్ పవర్ ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు చాలా అనుకూలంగా ఉండే ఈ కారులో మ్యాన్యువల్ తో పాటు ఏఎంటీ ఆప్షన్ కూడా అందుబాటులోకి రావడం విశేషం.
5. మారుతి సుజుకీ ఆల్టో కే10
భారతదేశంలో అత్యంత చవకైన సీఎన్‌జీ కార్లలో ఆల్టో కే10 ముందు వరుసలో ఉంటుంది. దీని ప్రారంభ ధర కేవలం రూ.4,84,400 మాత్రమే. ఇది కిలో సీఎన్‌జీకి 31.59 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 1-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కలగనే మధ్యతరగతి వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.




