Top 5 CNG Cars : మార్కెట్లో అదరగొడుతున్న టాప్ 5 CNG కార్లు ఇవే.!
Top 5 CNG Cars : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో భారతీయ వినియోగదారులు ఎక్కువగా సిఎన్‌జి (CNG) కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మెరుగైన ఇంధన సామర్థ్యం
Top 5 CNG Cars
Top 5 CNG Cars : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో భారతీయ వినియోగదారులు ఎక్కువగా సిఎన్‌జి (CNG) కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మెరుగైన ఇంధన సామర్థ్యం అందించడమే కాకుండా, సరికొత్త ‘డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ’ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల అద్భుతమైన మైలేజ్ రావడంతో పాటు, డిగ్గీలో బూట్ స్పేస్‌ను దాదాపు పూర్తిగా ఉపయోగించుకునే వీలుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా CNG కార్లు కేజీకి 26 నుండి 30 కిలోమీటర్ల మైలేజీని ఇస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. అలాంటి ఐదు ప్రముఖ కార్ల వివరాలు, వాటి ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
టాటా టియాగో సిఎన్‌జి
టాటా మోటార్స్ నుండి వస్తున్న చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో CNG ప్రారంభ ధర రూ.5.79 లక్షలుగా ఉంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తూ, సిఎన్‌జి మోడ్‌లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు భద్రత కోసం ఏబీఎస్, ఈఎస్‌సీ , టీపీఎంఎస్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.
టాటా పంచ్ సిఎన్‌జి
కాంపాక్ట్ ఎస్‌యూవీ లవర్స్ కోసం టాటా పంచ్ CNG మోడల్ అందుబాటులో ఉంది. రూ.6.79 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు డ్యూయల్-సిలిండర్ సెటప్‌తో వస్తుంది. ఇది కేజీ సిఎన్‌జికి సుమారుగా 26.99 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ , ఈ సెగ్మెంట్‌లోనే అత్యుత్తమ బూట్ స్పేస్ లభిస్తాయి.
హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి
సెడాన్ కార్లను ఇష్టపడే వారికి హ్యుందాయ్ ఆరా CNG ఒక మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర సుమారు రూ.7.81 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 1.2-లీటర్ బై-ఫ్యూయల్ ఇంజన్‌తో నడిచే ఈ కారులో భద్రతకు పెద్దపీట వేశారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ , టీపీఎంఎస్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లతో పాటు ఇది బెస్ట్ మైలేజీని అందిస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ సిఎన్జి
ఇక మైక్రో ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG బాగా పాపులర్ అయింది. దీని ప్రారంభ ధర దాదాపు రూ.6.99 లక్షలుగా ఉంది. ఇది కేజీకి సుమారు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని హ్యుందాయ్ చెబుతోంది. ఈ కారులో వాయిస్ ఎనేబుల్డ్ సన్‌రూఫ్, రియర్ కెమెరా, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డ్యాష్‌క్యామ్ , ఓటీఏ అప్‌డేట్‌ల వంటి ప్రీమియం ఫీచర్లు కలవు.
టాటా టిగోర్ సిఎన్‌జి
టాటా నుంచి వస్తున్న ప్రీమియం సెడాన్ కారు టిగోర్ CNG ప్రారంభ ధర రూ.7.21 లక్షలుగా ఉంది. ఇది కూడా 1.2-లీటర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమేటిక్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా , స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు దీని సొంతం. బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్... అదిరిపోయే మైలేజ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.




