మిడిల్ క్లాస్ మెచ్చిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిమీలు నాన్‌స్టాప్ జర్నీ!

Best Electric Scooters: భారతదేశంలో పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న తరుణంలో, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విప్లవాత్మకంగా పెరుగుతోంది.

Venkat
Published on: 12 May 2026 3:42 PM IST
Best Electric Scooters
X

మిడిల్ క్లాస్ మెచ్చిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిమీలు నాన్‌స్టాప్ జర్నీ!

Best Electric Scooters: భారతీయ ద్విచక్ర వాహన రంగంలో 2026 ఒక మైలురాయిగా నిలుస్తోంది. గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ విషయంలో ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ, కంపెనీలు ఇప్పుడు ఫవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్‌లను పరిచయం చేస్తున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టే అవసరం లేకుండా, ఇంటి వద్దే ఛార్జింగ్ చేసుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఇవి కేవలం 100 కిలోమీటర్ల పరిధికే పరిమితం కాకుండా, ఇప్పుడు 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అద్భుతమైన స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ లిస్ట్‌లో ఏమున్నాయో ఓసారి చూద్దాం..

సింపుల్ అల్ట్రా 400: దేశంలోనే అత్యధిక రేంజ్..

ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లలో సింపుల్ అల్ట్రా 400 అగ్రస్థానంలో ఉంది. ఇందులో 6.5 కిలోవాట్ సామర్థ్యం కలిగిన డ్యూయల్ బ్యాటరీ సెటప్ అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కేవలం 2.7 సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ స్కూటర్ ధర సుమారు 2.35 లక్షల రూపాయలుగా ఉంది.

ఓలా ఎస్1 ఎక్స్+: పొదుపుతో కూడిన ప్రయాణం..

తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఆశించే వారికి ఓలా ఎస్1 ఎక్స్+ ఒక చక్కని ఎంపిక. భారత్ 4680 సెల్స్ సాంకేతికతతో రూపొందిన ఈ స్కూటర్ 320 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ వాహనం ప్రారంభ ధర సుమారు 1.30 లక్షల రూపాయలు మాత్రమే.

ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్: హైటెక్ ఫీచర్ల సమాహారం..

సాంకేతికతను ఇష్టపడే యువత కోసం ఓలా కంపెనీ ఎస్1 ప్రో స్పోర్ట్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇందులో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అలర్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 320 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ స్కూటర్ ధర 1.50 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

కొమాకి ఎక్స్ఆర్7: బడ్జెట్ ధరలో భారీ మైలేజ్..

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి కొమాకి ఎక్స్ఆర్7 సరైన పరిష్కారం. కేవలం 89,999 రూపాయలకే లభించే ఈ స్కూటర్ 322 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడం విశేషం. ఇందులో అమర్చిన లైఫ్-పీఓ4 బ్యాటరీ ప్యాక్ సుదీర్ఘ కాలం మన్నికను ఇస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ: లగ్జరీకి మారుపేరు..

ప్రముఖ సంస్థ టీవీఎస్ నుంచి వచ్చిన ఐక్యూబ్ ఎస్టీ మోడల్ 212 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 7 అంగుళాల టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లతో లభించే ఈ స్కూటర్ ధర సుమారు 1.60 లక్షల రూపాయలు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story