5 Star Safety Cars : ఈ కార్లలో వెళితే ప్రాణాలకు ఫుల్ సేఫ్టీ.. 5-స్టార్ రేటింగ్‌తో దొరికే టాప్ 5 కార్లు ఇవే
5 Star Safety Cars : భారతదేశంలో లభించే అత్యంత సురక్షితమైన, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మీ ఫ్యామిలీకి పూర్తి రక్షణనిచ్చే టాప్ 5 బడ్జెట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
5 Star Safety Cars
5 Star Safety Cars : ఒకప్పుడు భారతీయులు కొత్త కారు కొనాలంటే కేవలం మైలేజ్, లుక్స్, ఫీచర్లు మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రమాదం జరిగినప్పుడు తమ కుటుంబానికి ఎంతవరకు రక్షణ ఉంటుందనే సేఫ్టీ అంశానికే కస్టమర్లు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు కూడా కస్టమర్ల మైండ్‌సెట్‌ను బట్టి తక్కువ ధర కార్లలోనే అత్యుత్తమ భద్రతా ఫీచర్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్ తక్కువగా ఉండి, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కారు కొనాలనుకుంటే.. మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఆప్షన్స్ ఇవే.
టాటా పంచ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో ఎస్‌యూవీల్లో టాటా పంచ్ ముందు వరుసలో ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం 5.64 లక్షల రూపాయలు మాత్రమే. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) లాంటి అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
నిస్సాన్ మాగ్నైట్
తక్కువ ధరలో సురక్షితమైన ఎస్‌యూవీ రైడ్ కావాలనుకునే వారికి నిస్సాన్ మాగ్నైట్ ఒక అద్భుతమైన ఛాయిస్. దీని ప్రారంభ ధర 5.65 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దల రక్షణ విభాగంలో ఈ మోడల్ 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ కారులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ఏబీఎస్ విత్ ఈబీడీ, బలమైన బాడీ స్ట్రక్చర్ వంటి నమ్మకమైన భద్రతా ప్రమాణాలు లభిస్తాయి.
టాటా ఆల్ట్రోజ్
టాటా కంపెనీకి చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్. దీని ప్రారంభ ధర 5.99 లక్షల రూపాయలుగా ఉంది. భారత్ NCAP టెస్టుల్లో ఈ కారుకు ప్రతిష్టాత్మక 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ఈ కారులోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లను టాటా మోటార్స్ అందిస్తోంది.
మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు సరికొత్త రికార్డులతో భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ సెడాన్ కార్ల జాబితాలోకి చేరిపోయింది. దీని ప్రారంభ ధర 6.26 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్). గ్లోబల్ NCAP, భారత్ NCAP రెండింటిలోనూ ఈ కారు ఘనంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ముఖ్యాంశాలు ఉన్నాయి.
టాటా నెక్సాన్
భారతీయ రోడ్లపై టాటా నెక్సాన్ ఒక బలమైన ఇనుప కోట లాంటిదని చెప్పొచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 7.37 లక్షల రూపాయలు. గ్లోబల్ NCAP, భారత్ NCAP రెండింటి నుంచి 5-స్టార్ రేటింగ్ సాధించిన ఘనత దీని సొంతం. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, చైల్డ్ సీట్ యాంకర్లు, సీట్ బెల్ట్ రిమైండర్‌లతో పాటు ఎన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మీ బడ్జెట్ కాస్త అటుఇటుగా ఉన్నా, ఫ్యామిలీ రక్షణ కోసం ఇది అత్యంత నమ్మకమైన కారు.




