Turbo SUVs: ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలా? రూ.8 లక్షల్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్లు ఇవే

Turbo SUVs: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా మారుతోంది.

CR Reddy
Published on: 21 Sept 2026 9:30 AM IST
maruti brezza
X

maruti brezza

Turbo SUVs: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా మారుతోంది. ఒకప్పుడు టర్బో-పెట్రోల్ ఇంజిన్లు కేవలం ఖరీదైన కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. సామాన్యుల బడ్జెట్‌కు తగినట్టుగానే రూ.7.5 లక్షల నుంచి రూ.8 లక్షల లోపు ధరలోనే పవర్ఫుల్ టర్బో ఎస్‌యూవీ కార్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అద్భుతమైన ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లు, అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్‌తో కూడిన కార్లను తక్కువ ధరకే అందిస్తున్నాయి.

1. మారుతి సుజుకి బ్రెజా

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టర్బో-పెట్రోల్ కార్లను తక్కువ బడ్జెట్‌లో అందించడంలో మారుతి సుజుకి ముందుంది. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది మారుతి సుజుకి బ్రెజా టర్బో-పెట్రోల్ ఎస్‌యూవీ గురించే. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.39 లక్షలుగా ఉంది. ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ లభిస్తుంది, ఇది 109bhp పవర్‌ను అందిస్తుంది. అలాగే ఇది లీటరుకు సుమారు 20.47 కి.మీ అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. బేస్ వేరియంట్ అయినప్పటికీ ఇందులో ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, పవర్ విండోస్,ESC వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

2. టాటా నెక్సాన్

మధ్యతరగతి కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని తయారైన మరో అద్భుతమైన కారు టాటా నెక్సాన్. రూ.7.40 లక్షల ప్రారంభ ధరతో లభించే టాటా నెక్సాన్ స్మార్ట్ వేరియంట్ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందుతోంది. క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీని శక్తివంతమైన టర్బో ఇంజిన్ అద్భుతమైన పనితీరును కనబరుస్తూ, డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తుంది.

3. సిట్రోయెన్ C3

స్టైలిష్ లుక్ కోరుకునే వారి కోసం సిట్రోయెన్ బ్రాండ్ చక్కటి ఎంపికగా నిలుస్తుంది. సిట్రోయెన్ C3 ఫీల్ టర్బో కారు రూ.7.50 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. దీని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఉన్న అడ్వాన్స్‌డ్ కంఫర్ట్ సస్పెన్షన్ రఫ్ రోడ్లపై కూడా ప్రయాణాన్ని ఎంతో సాఫీగా, సులభతరం చేస్తుంది. శక్తివంతమైన టర్బో ఇంజిన్‌తో పాటు విశాలమైన ఇంటీరియర్ కలిగి ఉండటం వల్ల ఇది ఫ్యామిలీ ట్రిప్స్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

4. స్కోడా కైలాక్

యూవతను, స్పోర్టీ లుక్ ఇష్టపడే వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్న కారు స్కోడా కైలాక్. స్కోడా సంస్థ నుంచి వచ్చిన స్కోడా కైలాక్ క్లాసిక్ కారు రూ.7.59 లక్షల ఆకర్షణీయమైన ధరకు లభిస్తోంది. కేవలం 10.5 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే పర్ఫామెన్స్ దీని సొంతం. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఉన్నాయి. అలాగే ఇది లీటరుకు సుమారు 19.68 కి.మీ మైలేజ్ ఇస్తూ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

5. మహీంద్రా XUV 3XO

పవర్, టార్క్ పరంగా తిరుగులేని పర్ఫామెన్స్ అందించే ఎస్‌యూవీలలో మహీంద్రా XUV 3XO ముందుంటుంది. ఈ జాబితాలో చివరగా చెప్పుకోవాల్సిన ప్రముఖ దేశీయ బ్రాండ్ అయిన మహీంద్రా XUV 3XO MX1 ఎస్‌యూవీ రూ.7.79 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న 1.2-లీటర్ mStallion టర్బో ఇంజిన్ అత్యధికంగా 200Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ కారు లీటరుకు 18.89 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కార్లన్నింటిలోనూ మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్ ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఇవి చక్కటి ఎంపికగా నిలుస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.