Upcoming Cars: టాటా, హ్యుందాయ్, మారుతి నయా ప్లాన్.. మార్కెట్లోకి రాబోతున్న 5 సరికొత్త కార్లు

Upcoming Cars: భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో కళకళలాడుతుంటుంది.

CR Reddy
Published on: 17 Oct 2026 9:39 AM IST
Maruti Ertiga Facelift
X

Maruti Ertiga Facelift

Upcoming Cars: భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో కళకళలాడుతుంటుంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన టాటా మోటార్స్, హుండై అలాగే మారుతి సుజుకి త్వరలోనే తమ సరికొత్త కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. సామాన్య ప్రజల నుంచి లగ్జరీ కార్ల లవర్ల వరకు అందరి అంచనాలను అందుకునేలా వివిధ సెగ్మెంట్లలో ఈ వాహనాలు లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ఎంపీవీలు, ఎస్‌యూవీలు అలాగే హ్యాచ్‌బ్యాక్ కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. రాబోయే కాలంలో రోడ్లపై సందడి చేయనున్న ఆ ఐదు ప్రధాన కార్ల గురించిన సమాచారం తెలుసుకుందాం.

1. మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

భారతీయ కుటుంబాల తొలి ఎంపికగా ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా ఎంబీవీ ఇప్పటికే మార్కెట్లో భారీ అమ్మకాలను నమోదు చేస్తోంది. అయితే పెరుగుతున్న పోటీని తట్టుకునేలా కంపెనీ ఈ పాపులర్ కారుకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. రాబోయే ఏడాదిలో లాంచ్ కానున్న ఈ మోడల్‌లో డిజైన్ పరంగా కొన్ని ఆకర్షణీయమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. కారు ఇంటీరియర్ మరింత ఆధునిక హంగులతో రానుండగా, ఇంజిన్ పనితీరు మరింత మెరుగ్గా ఉండి మంచి మైలేజీని అందించేలా రూపొందిస్తున్నారు. కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.

2. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్

ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌యూవీల హవా నడుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా ఆధారంగా ఒక 7-సీటర్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. పెద్ద కుటుంబాలు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా మూడు వరుసల సీట్లతో ఈ ఎస్‌యూవీ రానుంది. శక్తివంతమైన 1.5-లీటర్ మైल्ड-హైబ్రిడ్ అలాగే స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఇది లభించే అవకాశం ఉంది. విశాలమైన కేబిన్, అధునాతన భద్రతా ఫీచర్లు దీని సొంతం కానున్నాయి.

3. నెక్స్ట్-జెనరేషన్ టాటా నెక్సాన్

భారత రోడ్లపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ త్వరలోనే కొత్త రూపంలో రానుంది. టాటా మోటార్స్ ఈ పాపులర్ కారును పూర్తిగా కొత్త జెనరేషన్‌లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి గరుడ్ అనే కోడ్‌నేమ్ కేటాయించారు. 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ కొత్త నేక్సన్ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్, ప్లాట్‌ఫామ్ అలాగే కేబిన్ పరంగా భారీ మార్పులను సంతరించుకోనుంది. ప్రస్తుత మోడల్‌లో ఉన్న సక్సెస్‌ఫుల్ ఫీచర్లతో పాటు మరిన్ని అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లను జోడించేలా కంపెనీ కసరత్తు చేస్తోంది.

4. కొత్త హుంద్యాయ్ ఐ20

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హుంద్యాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారుకు త్వరలో పెద్ద అప్‌డేట్ రానుంది. ఇప్పటికే నాలుగో తరానికి చెందిన ఐ20 కారును బ్రెజిిల్ మార్కెట్లో హుండై విడుదల చేసింది. ఇదే మోడల్‌ను 2027 నాటికి భారత మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత దూకుడుగా ఉండే కొత్త డిజైన్, ఆకర్షణీయమైన లైటింగ్ సెటప్, సరికొత్త ఫీచర్లు ఈ కారులో చూడవచ్చు. ఇంజిన్ పరంగా 1.2-లీటర్ పెట్రోల్ అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. భారతీయ వినియోగదారుల రుచికి తగినట్లుగా దీని స్పెక్స్ ఉండేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

5. మారుతి సుజుకి వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్

భారతదేశంలో టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్‌గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మారుతి వాగన్ఆర్ మళ్లీ కొత్త రూపంలో ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ దశలో ఉన్నట్లు పలుమార్లు రోడ్లపై కనిపెట్టారు. పెద్ద మార్పుల కంటే ముఖ్యంగా చిన్నపాటి కాస్మోటిక్ అప్‌డేట్స్‌తో ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రానుంది. ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు జోడించనున్నారు. ముఖ్యంగా ఇంజిన్ సామర్థ్యంలో కొన్ని కీలక మార్పులు చేసి మరింత మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందించేలా ఈ బడ్జెట్ కారును తీర్చిదిద్దుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.