360 Degree Camera Cars: రూ.20 లక్షల లోపే 360 డిగ్రీల కెమెరా కార్లు.. మార్కెట్లో బెస్ట్ మోడల్స్ ఇవే!

360 Degree Camera Cars: దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి, హ్యుందాయ్ సంస్థలు తమ బడ్జెట్ కార్లలోనూ అధునాతన కెమెరా సాంకేతికతను విస్తృతంగా ప్రవేశపెట్టాయి.

Venkat
Updated on: 21 Aug 2026 12:08 PM IST
360 Degree Camera Cars
X

360 Degree Camera Cars: రూ.20 లక్షల లోపే 360 డిగ్రీల కెమెరా కార్లు.. మార్కెట్లో బెస్ట్ మోడల్స్ ఇవే!

360 Degree Camera Cars: ఇరుకైన వీధులు, రద్దీ రోడ్లపై కార్లను సురక్షితంగా నడపడం, పార్క్ చేయడం వాహనదారులకు పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆటోమొబైల్ సంస్థలు రూ.20 లక్షల లోపే 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ను అందిస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే ఈ రక్షణ ఫీచర్ అందిస్తున్న టాప్ కార్లు, వాటి బ్రాండ్ల విశేషాలు తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి, హ్యుందాయ్ సంస్థలు తమ బడ్జెట్ కార్లలోనూ అధునాతన కెమెరా సాంకేతికతను విస్తృతంగా ప్రవేశపెట్టాయి. మారుతి బ్రెజ్జా, డిజైర్, విక్టోరిస్ వంటి ఎరీనా మోడళ్లతో పాటు నెక్సా షోరూమ్‌లో లభించే బాలెనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, ఈ-విటారా కార్లలో 360-డిగ్రీ కెమెరా సెటప్ లభిస్తోంది.

ఇది వాహనం పరిసరాలను 3డీ రూపంలో స్పష్టంగా చూపిస్తుంది. ఇక హ్యుందాయ్ విషయానికొస్తే, తమ పాపులర్ ఎస్‌యూవీ క్రెటాతో పాటు వెన్యూ, వెర్నా, ఐ20 ఎన్-లైన్ మోడళ్లలో హై-క్లారిటీ కెమెరాను అమర్చారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలోనూ ఇది రియర్-వ్యూ మానిటర్‌లా పనిచేస్తూ భద్రతను పెంచుతుంది.

టాటా మోటార్స్ విస్తృత శ్రేణి ఎంపికలు..

టాటా మోటార్స్ తమ వాహనాల్లో సేఫ్టీ ఫీచర్లను ఎంట్రీ లెవల్, మిడ్-స్పెక్ వేరియంట్ల నుంచే అందించడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ చేస్తోంది. వినియోగదారులు టాప్ ఎండ్ మోడల్ కొనుగోలు చేయాల్సిన భారం లేకుండా బెస్ట్ సెల్లింగ్ మోడల్ నెక్సాన్‌తో పాటు కర్వ్, కర్వ్ ఈవీ, పంచ్, పంచ్ ఈవీ కార్లలో ఈ ఫీచర్‌ను పొందవచ్చు.

సంస్థకు చెందిన చిన్న కారు టియాగో, టియాగో ఈవీలలో కూడా 360 డిగ్రీల కెమెరా ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది టాప్-డౌన్ వ్యూతో పాటు ఫ్రంట్-ఓన్లీ వ్యూ అందిస్తూ ఇరుకైన జంక్షన్లలో డ్రైవర్లకు పూర్తి స్పష్టత ఇస్తుంది.

మహీంద్రా, హోండా సెడాన్లలో బ్లైండ్-స్పాట్ రక్షణ..

రగ్గడ్ ఎస్‌యూవీలతో ఆకట్టుకునే మహీంద్రా తమ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, థార్ రాక్స్ కార్లలో రూ.20 లక్షల లోపు ధరలోనే ఈ సెటప్‌ను ఇస్తోంది. టర్న్ ఇండికేటర్ వేసినప్పుడు ఇది బ్లైండ్-స్పాట్ మానిటర్‌లా మారి పక్కన వచ్చే వాహనాలను హెచ్చరిస్తుంది.

సెడాన్ విభాగంలో హోండా తమ పాపులర్ మోడళ్లయిన అమేజ్, సిటీ కార్లలో 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ను జోడించింది. గతంలో కేవలం రియర్ కెమెరా, సైడ్ మిర్రర్ బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో వచ్చిన ఈ కార్లు ఇప్పుడు పూర్తి సరౌండ్ వ్యూతో దైనందిన ప్రయాణాల్లో పార్కింగ్‌ను ఎంతో సులభతరం చేస్తున్నాయి.

పెరుగుతున్న ట్రాఫిక్ పరిస్థితుల్లో చిన్నపాటి గీతలు, ప్రమాదాల బారిన పడకుండా కార్లను కాపాడుకోవడానికి 360 డిగ్రీల కెమెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లోనే ప్రీమియం భద్రతా ఫీచర్లు లభిస్తుండటంతో కార్ల కొనుగోలుదారులకు ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story