2 సెకన్లలోనే 40 కిమీల వేగం.. మైలేజ్‌లోనే కాదు, ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!
Top Sporty Electric Dcooters in India: ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే కేవలం తక్కువ వేగంతో సిటీలో తిరిగేవనే రోజులు పూర్తిగా పోయాయి.
2 సెకన్లలోనే 40 కిమీల వేగం.. మైలేజ్‌లోనే కాదు, ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!
Top Sporty Electric Dcooters in India: ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే కేవలం తక్కువ వేగంతో సిటీలో తిరిగేవనే రోజులు పూర్తిగా పోయాయి. ఇప్పుడు పెట్రోల్ వాహనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లే అత్యాధునిక మోడల్స్ భారత మార్కెట్లోకి వచ్చేశాయి. క్షణాల్లోనే టాప్ స్పీడ్ అందుకుంటూ రైడర్లకు థ్రిల్ పంచుతున్న టాప్-5 స్పోర్ట్స్ ఈవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత ఈవీ మార్కెట్లో స్పీడ్ పరంగా ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ (Ola S1 Pro Sport) ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఇందులో అమర్చిన 4680-సెల్ బ్యాటరీతో పాటు శక్తివంతమైన మోటార్ ఏకంగా 21.4 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 2 సెకన్లలోనే జీరో నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. గరిష్టంగా 152 kmph వేగంతో దూసుకెళ్లే ఈ స్కూటర్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
దీని ప్రారంభ ధర రూ.1.49 లక్షలు. మరోవైపు ఔత్సాహికులను ఆకట్టుకునేలా మార్కెట్లోకి వచ్చిన సింపుల్ వన్ (Simple One) కూడా రేసులో గట్టి పోటీ ఇస్తోంది. 11.8 bhp పవర్, 72 Nm టార్క్‌తో పనిచేసే ఈ ఈవీ గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రూ.1.78 లక్షల ధరకు లభించే ఈ స్కూటర్ 265 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అద్భుతమైన థొరెటల్ రెస్పాన్స్ దీని సొంతం.
రైడింగ్ థ్రిల్ పంచే టీవీఎస్ ఎక్స్, ఏథర్ అపెక్స్..
స్పోర్ట్స్ లుక్, అత్యుత్తమ హ్యాండ్లింగ్ కోరుకునే వారికి ఏథర్ 450 అపెక్స్ (Ather 450 Apex) బెస్ట్ ఆప్షన్. వేగం కన్నా రైడింగ్ డైనమిక్స్, బ్రేకింగ్ సిస్టమ్‌పై ఏథర్ ఎక్కువ దృష్టి పెట్టింది. దీని గరిష్ట వేగం 100 kmph కాగా, రూ.1.95 లక్షల ధరకు 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
అలాగే స్పోర్ట్స్ బైక్ తరహా అనుభూతిని ఇచ్చేలా అల్యూమినియం ఫ్రేమ్, మోనోషాక్ సస్పెన్షన్‌తో రూపొందిన మోడల్ టీవీఎస్ ఎక్స్ (TVS X). 14.8 bhp పవర్‌తో 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని ఇది క్షణాల్లోనే అందుకుంటుంది. రోజువారీ కమ్యూటర్ ఈవీలా కాకుండా పెర్ఫార్మెన్స్ మెషీన్‌లా అనిపించే దీని ధర రూ.2.66 లక్షల నుంచి మొదలవుతుంది.
జపాన్ టెక్నాలజీతో యమహా ఏరోక్స్-ఈ..
జులై 2026లో భారత మార్కెట్లోకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన యమహా ఏరోక్స్-ఈ (Yamaha Aerox-E) మ్యాక్సీ స్కూటర్ డిజైన్‌తో అదరగొడుతోంది. ఎకో, స్టాండర్డ్, పవర్, బూస్ట్ మోడ్స్‌తో పాటు 12.6 bhp పవర్ ఉత్పత్తి చేసే ఈ జపనీస్ బ్రాండ్ గరిష్ట వేగం 95.5 kmph. రెండు 1.5 kWh బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తున్న ఈ స్కూటర్ ధర ఈ జాబితాలో అత్యధికంగా రూ.2.82 లక్షలుగా ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 117 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుంది.
రోజువారీ ప్రయాణాలకు మాత్రమే పరిమితం కాకుండా, థ్రిల్లింగ్ రైడింగ్ అనుభూతిని కోరుకునే యువతే లక్ష్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి. మీ బడ్జెట్, వేగం, డిజైన్ అభిరుచి ఆధారంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ ఈవీని ఎంచుకోవచ్చు.




