Toyota Glanza: కార్ లవర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెలే మార్కెట్లోకి కొత్త టయోటా గ్లాంజా
Toyota Glanza: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అక్టోబర్ 2026లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Toyota Glanza
Toyota Glanza: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అక్టోబర్ 2026లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సరికొత్త డిజైన్, అధునాతన ఇంజిన్ ఆప్షన్లు, హైటెక్ భద్రతా ఫీచర్లతో ఈ కారు వాహన ప్రియులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.
అదుర్స్ అనిపించే ఎక్స్‌టీరియర్ డిజైన్
టయోటా, మార్కెట్ దిగ్గజం మారికో-మారుతి భాగస్వామ్యంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న కొత్త గ్లాంజా ఎక్స్‌టీరియర్ పరంగా ఆకట్టుకునే మార్పులతో రానుంది. ముందు భాగంలో అకర్షణీయమైన గ్రిల్, కొత్త స్టైలిష్ క్రోమ్ ఫినిషింగ్, బోనెట్ రూపకల్పనలో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. హెడ్‌లాంప్‌లు, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, టర్న్ ఇండికేటర్లు పాత మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కారుకు ప్రీమియం లుక్ ఇచ్చేలా ప్రత్యేకమైన 16-ఇంచ్ అలాయ్ వీల్స్, రీ-డిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌ను అందించనున్నారు.
సేఫ్టీకి పెద్దపీట.. లెవెల్ 2 ADAS టెక్నాలజీ
ఈ కొత్త గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇందులో అందించనున్న లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS). ఈ విభాగంలోని హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఈ విధమైన అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్ రావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరట. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై బీమ్ అసిస్ట్ వంటి కీలక భద్రతా సదుపాయాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఈ ఫీచర్లను ఆన్ లేదా ఆఫ్ చేసుకునేలా డ్యాష్‌బోర్డ్‌పై ప్రత్యేకమైన బటన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
కార్ ఆటోమోటివ్ ఇంటీరియర్
కారు లోపలి భాగాన్ని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, యూవీ-కట్ గ్లాస్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, 9-ఇంచ్ సైజు ఉండే భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుపరిచారు. వీటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక హంగులు కలవు. సేఫ్టీని మరింత కట్టుదిట్టం చేసేందుకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ సిస్టమ్‌ను ప్రామాణికంగా అందించనున్నారు.
పవర్ఫుల్ కొత్త 3-సిలిండర్ జెడ్-సిరీస్ ఇంజిన్
ఇంజిన్ విభాగంలో టోయోటా పెద్ద మార్పునే చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న 1.2-లీటర్ 4-సిలిండర్ కె-సిరీస్ స్థానంలో కొత్తగా 1.2-లీటర్ 3-సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకొస్తున్నారు. ఇది 81 బిహెచ్‌పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్లలో లభించనుంది. భవిష్యత్తులో సీఎన్‌జీ మోడళ్లలోనూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.




