Toyota Glanza: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. టయోటా కొత్త గ్లాంజా ఫేస్ లిఫ్ట్ కారు ప్రత్యేకతలు ఇవే
Toyota Glanza: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.
Toyota Glanza
Toyota Glanza: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టయోటా సంస్థ తన పాపులర్ కార్ అయిన గ్లాంజాకు సంబంధించిన లేటెస్ట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. మారుతి సుజుకి బెలెనో ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేసిన ఈ కొత్త గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ కారును మొత్తం 5 వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇందులో పెట్రోల్ తో పాటు సీఎన్జీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎంట్రీ లెవెల్ E వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.6.99 లక్షలు ఉండగా, టాప్ ఎండ్ V(O) వేరియంట్ ధర రూ.10.49 లక్షల వరకు నిర్ణయించారు.
పవర్ ఫుల్ ఇంజిన్,అద్భుతమైన మైలేజ్
ఈ కొత్త గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ కారులో 1.2-లీటర్ త్రీ-సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది సుమారు 83 పీఎస్ పవర్, 112.4 ఎన్ఎం టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక సీఎన్జీ మోడ్‌లో నడిపినప్పుడు దాదాపు 69.7 పీఎస్ పవర్ లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్లో పెట్రోల్ వెర్షన్ లీటరుకు 23.80 కిలోమీటర్లు, ఏఎంటీ ఆప్షన్లో 24.77 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యంగా సీఎన్జీ వేరియంట్లోనూ ఏఎంటీ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ టెక్నాలజీని టయోటా ఇంటెలిజెంట్ గిఫ్ట్ షిఫ్ట్ (IGS) అని పిలుస్తుంది.
బేస్ వేరియంట్ నుంచి అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు
కొత్త గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ అన్ని వేరియంట్లలోనూ అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించారు. ఎంట్రీ లెవెల్ బేస్ వేరియంట్ Eలోనే ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిఫాగర్, పవర్ విండోస్ వంటి అద్భుతమైన ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. అలాగే టాప్ ఎండ్ మోడళ్లలో లేవల్-2 ఏడీఏఎస్ ఫీచర్‌ను కూడా జోడించడం ద్వారా ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేశారు.
వివిధ వేరియంట్ల వారీగా లభించే ప్రత్యేక ఫీచర్లు
S / S CNG వేరియంట్: దీని ప్రారంభ ధర రూ.7.71 లక్షలు. ఇందులో 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రియర్ ఏసీ వెంట్లు లభిస్తాయి.
G / G CNG వేరియంట్: దీని ధర రూ.8.73 లక్షలు. ఇందులో పూర్తి ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఆటోమేటిక్ హెడ్లైట్లు, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ అసిస్టెంట్, ఆటో ఏసీ లభిస్తాయి.
V మరియు V(O) వేరియంట్లు: ఇవి టాప్ మోడల్స్ కాగా, క్రూయిజ్ కంట్రోల్, లెదర్ అపహోల్స్ట్రీ, సన్‌గ్లాస్ హోल्डर, అత్యాధునిక లేవల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.




