Toyota Hilux : ఆఫ్‌రోడింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త హిలక్స్ వస్తోంది.!

Toyota Hilux : మీకు లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం ఇష్టమా? అడ్వెంచర్ ట్రిప్స్ అంటే ప్రాణమా? అయితే మీకోసమే టయోటా సంస్థ ఒక అదిరిపోయే పికప్ ట్రక్కును ఇండియన్

G Krishna
Published on: 18 July 2026 11:21 AM IST
toyota hilux
X

toyota hilux 

Toyota Hilux : మీకు లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం ఇష్టమా? అడ్వెంచర్ ట్రిప్స్ అంటే ప్రాణమా? అయితే మీకోసమే టయోటా సంస్థ ఒక అదిరిపోయే పికప్ ట్రక్కును ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తోంది. తన పవర్‌ఫుల్ పికప్ ట్రక్ 'హిలక్స్' కొత్త వెర్షన్‌ను లాంచ్ చేయడానికి టయోటా సర్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను కూడా కంపెనీ రిలీజ్ చేయడంతో వాహన ప్రియుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే సూపర్ హిట్ అయిన ఈ సరికొత్త హిలక్స్.. అదే స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో జూలై 28న మనదేశంలో అధికారికంగా విడుదల కానుంది.

కొత్తగా ఏముంది? ఎక్స్‌టీరియర్ లుక్ ఎలా ఉందంటే..

టయోటా రిలీజ్ చేసిన టీజర్‌లో కొత్త హిలక్స్ సరికొత్త బ్రాంజ్ కలర్‌లో మెరిసిపోతూ కనిపించింది. పాత మోడల్‌తో పోలిస్తే కారు ముందు భాగంలో కంపెనీ చాలా మార్పులు చేసింది. ముఖ్యంగా సిల్వర్ స్కిడ్ ప్లేట్, హనీకోంబ్ స్టైల్‌లో ఉన్న సెంటర్ గ్రిల్ కారుకు మంచి రగ్గడ్ లుక్‌ను ఇచ్చాయి. ఎప్పుడూ ఉండే టయోటా లోగోకు బదులుగా, స్లిమ్ LED హెడ్‌లైట్ల మధ్య నల్లటి ప్యానెల్‌పై 'TOYOTA' అని ఇంగ్లీష్ అక్షరాలతో బోల్డ్‌గా రాయడం ఈ ట్రక్కుకు మరింత ప్రీమియం స్టైల్‌ను తీసుకొచ్చింది.

ఇక పక్కన చూస్తే నలుపు రంగు అలాయ్ వీల్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, వెనుక భాగంలో రోల్ బార్లు, రూఫ్ పై షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి స్పోర్టీ ఎలిమెంట్స్ ఉన్నాయి. వెనుక భాగం డిజైన్‌ను కంపెనీ పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, గ్లోబల్ వెర్షన్ లాగే నిలువుగా ఉండే LED టెయిల్‌లైట్లు, టెయిల్‌గేట్‌పై హిలక్స్ బ్రాండింగ్ ఉండే అవకాశం ఉంది.

లోపల కూడా లగ్జరీ.. హైటెక్ ఫీచర్లు

ఈ సరికొత్త పికప్ ట్రక్ డబుల్ క్యాబ్ (5 సీటర్) ఆప్షన్ లోనే రానుంది. ప్రయాణికులకు మంచి కంఫర్ట్ ఇచ్చేలా లోపల క్యాబిన్‌ను లగ్జరీగా డిజైన్ చేశారు. కారు లోపల లెదర్ స్టీరింగ్ వీల్, సరికొత్త డాష్‌బోర్డ్‌తో పాటు 12.3 అంగుళాల డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు ఉండనున్నాయి. దీనితో పాటు స్మార్ట్ కనెక్ట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే లేదా ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్ , సేఫ్టీ కోసం మరికొన్ని లేటెస్ట్ ఫీచర్లు ఇందులో జోడించే ఛాన్స్ ఉంది.

ఇంజన్ పవర్ మామూలుగా లేదుగా

హిలక్స్ అంటేనే పవర్‌కు కేరాఫ్ అడ్రస్. ఇందులో 2.8 లీటర్, నాలుగు సిలిండర్ల టర్బో-డీజిల్ ఇంజిన్నే టయోటా కొనసాగించనుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ 204 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 420 Nm టార్క్‌ను, అలాగే 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 500 Nm భారీ టార్క్‌ను అందిస్తుంది.

గ్లోబల్ మార్కెట్లో ఈ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో లభిస్తోంది, ఇది మైలేజీని, స్మూత్‌నెస్‌ను పెంచుతుంది. అయితే ఈ హైబ్రిడ్ ఆప్షన్‌ను ఇండియాలో ఇస్తారా లేదా అనేది లాంచ్ రోజున తెలియనుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రావడం వల్ల ఎలాంటి కఠినమైన కొండ దారులు, గుంతల రోడ్లనైనా చాలా సులభంగా దాటేస్తుంది.

ధర ఎంత ఉండొచ్చు.?

ప్రస్తుతం మన మార్కెట్లో ఉన్న టయోటా హిలక్స్ ధరలు రూ. 28.52 లక్షల నుండి రూ. 36 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ మోడల్‌లో బోలెడు మార్పులు, అదనపు ఫీచర్లు వస్తున్నందున, దీని ధర ప్రస్తుత మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి, అలాగే రోడ్లపై రగ్గడ్ లుక్‌తో డిఫరెంట్‌గా కనిపించాలనుకునే వారికి ఈ కొత్త హిలక్స్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story