Triumph: స్పీడ్ లవర్స్‌కి పండగే పండగ.. ఈ బైక్ చూస్తే రోడ్డు మీద రయ్‌ రయ్‌ అనాల్సిందే

Triumph: ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ భారతీయ మార్కెట్లో తన సరికొత్త స్పోర్ట్స్ బైక్ 2026 ట్రయంఫ్ డేటోనా 660ను అధికారికంగా విడుదల చేసింది.

CR Reddy
Published on: 25 Sept 2026 6:50 AM IST
Triumph Daytona 660
X

Triumph Daytona 660

Triumph: ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ భారతీయ మార్కెట్లో తన సరికొత్త స్పోర్ట్స్ బైక్ 2026 ట్రయంఫ్ డేటోనా 660ను అధికారికంగా విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే దీని ధర కేవలం రూ.11,000 మాత్రమే పెరిగింది. అయితే ధరలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ కంపెనీ ఈ బైక్‌లో రైడర్స్‌కు ఉపయోగపడే అనేక కీలకమైన అప్‌డేట్స్, అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ ట్రయంఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్, సరికొత్త టైర్లు

ఈ కొత్త మోడల్‌లో కంపెనీ అత్యంత ముఖ్యమైన మార్పులు సస్పెన్షన్ విషయంలో చేసింది. ఇందులో ముందు వైపు 41mm Showa USD ఫోర్క్స్‌ను అమర్చారు, వీటిలో కంప్రెషన్, రిబౌండ్ డ్యామింగ్‌ను రైడర్ అవసరానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పాత మోడల్‌లో ఆప్షనల్‌గా ఉన్న బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఫీచర్‌ను ఇప్పుడు స్టాండర్డ్‌గా ఇచ్చారు. అంతేకాకుండా, బైక్ రోడ్డుపై పట్టు మెరుగుపడేందుకు వీలుగా ఇందులో సరికొత్త Metzeler M9 RR టైర్లను ఉపయోగించారు.

పవర్ఫుల్ ఇంజిన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్

ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉన్న అదే శక్తివంతమైన 660cc, లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ 3-సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ సుమారు 95bhp బ్హ్రప్ పవర్, 68Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీనిలోని స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్, ట్విన్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ బెస్ట్ బ్రేకింగ్ అనుభూతిని ఇస్తాయి. రైడింగ్ పొజిషన్ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

ఆకర్షణీయమైన కొత్త కలర్ ఆప్షన్లు

యూవానులను ఆకట్టుకునేందుకు ట్రయంఫ్ సంస్థ ఈ బైక్‌ను మూడు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. అవి: అల్యూమినియం సిల్వర్, కాస్మిక్ ఎల్లో, సఫైర్ బ్లాక్. సిల్వర్, ఎల్లో కలర్స్‌లో బ్లాక్ హైలైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కంపెనీ సమాచారం ప్రకారం.. రాబోయే కొన్ని వారాల్లోనే ఈ బైక్‌ల డెలివరీలు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో ప్రారంభం కానున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.