Triumph Tracker 400 : ట్రయంఫ్ ట్రాకర్ 400 రివ్యూ.. స్పీడ్ 400 కంటే 'నాటీ' బైక్.!

Triumph Tracker 400 : బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్యంలో వస్తున్న 400సీసీ ప్లాట్‌ఫారమ్‌లో సరికొత్త బైక్ 'ట్రయంఫ్ ట్రాకర్' (Triumph Tracker) మార్కెట్లోకి అడుగుపెట్టింది.

G Krishna
Published on: 26 Jun 2026 11:52 AM IST
Triumph-Tracker-400
X

Triumph-Tracker-400

Triumph Tracker 400 : బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్యంలో వస్తున్న 400సీసీ ప్లాట్‌ఫారమ్‌లో సరికొత్త బైక్ 'ట్రయంఫ్ ట్రాకర్' (Triumph Tracker) మార్కెట్లోకి అడుగుపెట్టింది. మొదటి చూపులో ఇది కేవలం 'స్పీడ్ 400' మోడల్‌కు కాస్మెటిక్ మార్పులు చేసిన బైక్‌లా అనిపించినప్పటికీ, రోడ్డుపైకి తీసుకెళ్తే మాత్రం దీనికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, క్యారెక్టర్ ఉన్నాయని అర్థమవుతుంది. ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ (Flat-track racing) స్ఫూర్తితో రూపొందించిన ఈ మోటార్ సైకిల్, ఒక ప్యూర్ ఆఫ్-రోడర్ కాదు గానీ.. రగ్గడ్ లుక్ ఉన్న పక్కా స్ట్రీట్ బైక్.

థ్రక్స్టన్, స్క్రాంబ్లర్ కలయికలాంటి డిజైన్

విజువల్స్ పరంగా ఈ బైక్ ట్రయంఫ్ మోడల్స్ అయిన స్పీడ్ 400, థ్రక్స్టన్, స్క్రాంబ్లర్‌ల మిశ్రమంలా కనిపిస్తుంది. ముందు భాగంలో బ్లాక్-అవుట్ ఫ్లైస్క్రీన్ , యూఎస్‌డీ (USD) ఫోర్క్స్ దీనికి మరింత పవర్‌ఫుల్ లుక్‌ని ఇచ్చాయి. సైడ్ ప్యానెల్స్‌పై ఉన్న సింపుల్ '400' గ్రాఫిక్స్ దీని ప్రత్యేకతను చాటుతాయి. ఇక వెనుక సీటు , టైల్ సెక్షన్ డిజైన్ పూర్తిగా 'థ్రక్స్టన్' (Thruxton) బైక్ నుండి ప్రేరణ పొంది స్పోర్టీగా ఉండగా, ఎగ్జాస్ట్ పైపును 'స్క్రాంబ్లర్ 400X' నుండి తీసుకున్నారు. ట్రయంఫ్ దీని ఫ్యూయల్ ట్యాంక్‌ను కూడా కొద్దిగా రీడిజైన్ చేసింది.. ట్యాంక్ అంచులు కాస్త సన్నగా ఉండటం వల్ల రైడర్ మోకాలు బైక్‌ను గట్టిగా పట్టుకోవడానికి థై గ్రిప్ వీలుగా ఉంటుంది.

డైమెన్షన్స్ , ఫీచర్లు

ఈ బైక్ బరువు 181 కేజీలు. దీని సీటు ఎత్తు 805 మిమీ ఉండగా, గ్రౌండ్ క్లియరెన్స్ 162 మిమీ. ఇరువైపులా సస్పెన్షన్ ట్రావెల్ 130 మిమీకి పెంచారు, ఇది స్పీడ్ 400 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, స్క్రాంబ్లర్ మోడల్స్ కంటే తక్కువే. స్పీడ్ 400 కంటే ఈ ట్రాకర్ కాస్త వెడల్పుగా ఉంటుంది , దీని టర్నింగ్ రేడియస్ కూడా తక్కువ. 13 లీటర్ల ఇంధన సామర్థ్యం గల ట్యాంక్‌తో వచ్చే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 146 కిమీ (Speed 400 వేగం 142 kmph). అయితే, ఫ్లాట్-ట్రాక్ స్పూర్తితో వచ్చిన ఈ బైక్‌లో స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చినప్పటికీ, స్విచబుల్ ఏబీఎస్ ఇవ్వకపోవడం గమనార్హం.

అగ్రెసివ్ సిట్టింగ్ పొజిషన్.. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

స్పీడ్ 400తో పోలిస్తే ట్రాకర్ రైడింగ్ పొజిషన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. దీని హ్యాండిల్‌బార్ కాస్త కిందకు, వెడల్పుగా ఉంటుంది. అలాగే ఫుట్‌పెగ్స్ కొంచెం పైకి, వెనుకకు అమర్చబడ్డాయి. ఈ మార్పుల వల్ల రైడర్ మరింత స్పోర్టీగా, బైక్‌తో ఎక్కువ కనెక్ట్ అయి రైడ్ చేయవచ్చు.

ఇందులో 349సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను వాడారు. ఇది 40 బీహెచ్‌పీ పవర్, 32 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఈ ఇంజన్ 'థ్రక్స్టన్' ట్యూనింగ్‌ను కలిగి ఉండటం వల్ల తక్కువ ఆర్‌పీఎమ్ (RPM) లోనూ ఎంతో చురుగ్గా స్పందిస్తుంది. కేవలం 3,000 ఆర్‌పీఎమ్ వద్దే 80 శాతం టార్క్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ చెబుతోంది. సిటీ ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండా ఈ బైక్ సజావుగా దూసుకెళ్తుంది. థ్రక్స్టన్ బైక్ తరహాలోనే దీని స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా షార్ప్‌గా ఉంటుంది.

ధర , తీర్పు

భారత మార్కెట్లో ట్రయంఫ్ ట్రాకర్ 400 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.46 లక్షలుగా ఉంది. ఇది స్పీడ్ 400 కంటే సుమారు రూ. 11,000–12,000 ఖరీదైనది, అలాగే స్క్రాంబ్లర్ 400X కంటే రూ. 12,000–13,000 తక్కువ. స్పీడ్ 400 కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టినప్పటికీ.. ఇందులో లభించే అగ్రెసివ్ లుక్, షార్ప్ హ్యాండ్లింగ్ , రైడింగ్ ఫన్ ఆ అదనపు ధరకు పూర్తి న్యాయం చేస్తాయి. రోజువారీ వాడకానికి ఇబ్బంది లేకుండా, కాస్త విభిన్నమైన, అల్లరి (Naughty) క్యారెక్టర్ ఉన్న బైక్ కావాలనుకునే యువ రైడర్లకు ట్రయంఫ్ ట్రాకర్ ఒక బెస్ట్ ఆప్షన్.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story