TVS Ronin: ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌తో వచ్చిన కొత్త టీవీఎస్ రోనిన్.. ధర, ప్రత్యేకతలు ఇవే
TVS Ronin: పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మార్కెట్‌లో సంచలన ప్రకటన చేసింది.
TVS Ronin
TVS Ronin: పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మార్కెట్‌లో సంచలన ప్రకటన చేసింది. తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ అయిన టీవీఎస్ రోనిన్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ భారీ అప్‌డేట్లను ప్రకటించింది. కేవలం రోనిన్ మాత్రమే కాకుండా యువత ఎంతగానో ఇష్టపడే అపాచి సిరీస్‌లో ప్రత్యేకమైన బ్లాక్ డైమండ్ ఎడిషన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త బైకుల ధరలు అలాగే వాటి ప్రత్యేకతల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఈ అప్‌డేటెడ్ లైనప్‌లో భాగంగా టీవీఎస్ రోనిన్ బైక్ కొత్త బేస్ వేరియంట్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ కొత్త వేరియంట్‌లో డ్యూయల్-చానల్ ఏబీఎస్‌తో పాటు సరికొత్త కలర్ ఆప్షన్లను అందించారు. ముఖ్యంగా సన్ లీట్ ఎల్లో అలాగే డెజర్ట్ మిరాజ్ రంగులలో ఈ బైక్ కనువిందు చేస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.42 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. నియో-రైడర్ డిజైన్‌ను ఇష్టపడే వారికి ఈ కొత్త బేస్ వేరియంట్ చక్కటి ఎంపికగా నిలుస్తుంది.
రోనిన్ మిడ్-స్పెక్ వేరియంట్‌లోనూ కంపెనీ కొన్ని అత్యవసర ఫీచర్లను జోడించింది. రోజూ ప్రయాణించే వారికి ఉపయోగపడేలా కనెక్టెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే టైప్-సీ ఛార్జింగ్ పోర్టును ఇందులో అమర్చారు. గ్లేసియర్ సిల్వర్ అలాగే చార్కోల్ ఎంబర్ రంగులలో లభించే ఈ వేరియంట్ ధర రూ.1.52 లక్షలుగా ఉంది. ఇక అత్యంత ముఖ్యమైన టాప్ వేరియంట్‌లో రైడర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమమైన ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. దీనితో పాటు ప్రీమియం సీటు, టైప్-సీ ఛార్జర్ వంటి సదుపాయాలు లభిస్తాయి. నింబస్ గ్రే అలాగే మిడ్‌నైట్ బ్లూ రంగులలో లభించే ఈ టాప్ వేరియంట్ ధర రూ.1.64 లక్షలుగా ఉంది.
ఇదిలా ఉండగా టీవీఎస్ సంస్థ అపాచి ఆర్టీఆర్ 310 అలాగే అపాచి ఆర్ఆర్ 310 మోడళ్లలో ప్రత్యేకమైన బ్లాక్ డైమండ్ ఎడిషన్ బైకులను కూడా లాంచ్ చేసింది. ఈ రెండు బైకులు పూర్తిగా ఆల్-బ్లాక్ లుక్‌తో చాలా దూకుడుగా కనిపిస్తాయి. అపాచి ఆర్టీఆర్ 310 బ్లాక్ డైమండ్ ఎడిషన్ ధర రూ.2,48,990 కాగా, పూర్తి ఫెయిర్డ్ డిజైన్ కలిగిన అపాచి ఆర్ఆర్ 310 బ్లాక్ డైమండ్ ఎడిషన్ ధర రూ.2,87,790గా ఉంది. ఈ మోడళ్లలో కీస్‌లెస్ రైడ్ టెక్నాలజీని కూడా పరిచయం చేశారు. కార్నరింగ్ ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్ ఈ బైక్‌ల ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.




