TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ, ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు

TTD: కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు.

Balachander
Published on: 14 April 2026 7:33 AM IST
TTD
X

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ, ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు

TTD: కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైంది. వేసవిలో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి వీఐపీ దర్శనాలు, స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లను తాత్కాలికంగా రద్దు చేయాలని చూస్తున్నది.

సామాన్య భక్తుల కోసమే

అయితే, టీటీడీ తీసుకునే ఈ నిర్ణయం అమలు చేయడం ద్వారా సామాన్య భక్తులు మరింత సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గత మూడేళ్ల గణాంకాలను పరిశీలించింది. మే, జూన్, జులై నెలల్లో ప్రతినెలా సుమారు 23 నుంచి 24 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్టు గుర్తించారు. వీఐపీ దర్శనాల కోసం రోజు 2 నుంచి 3 గంటల సమయాన్ని కేటాయించబడుతోంది. ఈ రెండు మూడు గంటల్లో సుమారు 3800 మంది మాత్రమే దర్శనం పొందుతున్నారు. అదే సమయాన్ని సామాన్య భక్తుల కోసం కేటాయిస్తే సుమారు 15 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. కొద్దిమంది ప్రముఖుల కంటే వేలమంది పేద, మధ్యతరగతి భక్తుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే పరమార్థంగా టీటీడీ ఈ ముందడుగు వేస్తోంది.

వైకుంఠ ఏకాదశి నమూనా - నిరీక్షణకు చెక్

ప్రస్తుతం సర్వదర్శనం కోసం భక్తులు 22 నుంచి 23 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీనిని మార్చేందుకు గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలు చేసిన విధానాన్ని అనుసరించాలని టీటీడీ భావిస్తోంది. ఈ విధానంలో అన్ని కేటగిరీలు తాత్కాలికంగా పక్కనపెట్టి ఒకేవిధమైన దర్శనాన్ని నిర్వహించడం ద్వారా నిరీక్షణ సమయాన్ని 8 నుంచి 12 గంటల మధ్యకు తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా రోజుకు సుమారు 80,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు. భగవంతుడి ముందు అందరూ సమానులే. ఈ సూత్రాన్ని నిజం చేస్తూ, గంటల తరబడి క్యూలైన్లలో అలసిపోయే సామాన్య భక్తుడికి త్వరగా గోవిందుడి దర్శనం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. తిరుమల యాత్ర మరింత సౌకర్యవంతంగా, ఆధ్యాత్మికంగా అనుభూతి కలిగించేలా టీటీడీ ఈ మార్పులను అమలు చేయాలని సంకల్పిస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story