Bhongir: ఎస్ఐ నిర్లక్ష్యం.. పోక్సో కేసు నిందితుడిని వదిలేయడంతో బాలిక కిడ్నాప్!

Bhongir: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 July 2026 4:59 PM IST
Bhongir
X

Bhongir: ఎస్ఐ నిర్లక్ష్యం.. పోక్సో కేసు నిందితుడిని వదిలేయడంతో బాలిక కిడ్నాప్!

Bhongir: యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒక మైనర్ బాలిక ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఒక పోక్సో (POCSO) కేసు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించకుండా,

స్టేషన్ నుండి వదిలేయడంతో ఆ నిందితుడు ఏకంగా సదరు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పరారయ్యాడు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో సంచలనం సృష్టించిన షాబాద్ తరహా ఘటన ఇక్కడ పునరావృతం అవుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story